తాగుడుకు అడ్డొస్తుందని కన్న కూతురిని కడతేర్చిన కసాయి తల్లి

On: Tuesday, July 8, 2025 6:54 PM

 

భీంగల్ మండలం గోనొప్పుల గ్రామానికి చెందిన గంగోని మల్లేష్ రమ్యకు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది వీరు కూలి పని పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు వీరికి ఐదు నెలల కూతురు శివాని ఉంది అయితే ఇటీవల కాలంలో రమ్య కల్లుకు బానిస అయింది భర్త మల్లేష్ తీరు మార్చుకోవాలని భార్యకు ఇతావు పలికాడు ఆమె మారకపోవడంతో వారం రోజుల క్రితం ఇద్దరి మధ్య గొడవ జరిగింది ఇరు కుటుంబాల పెద్దలు సర్దిచెప్పి పంపారు అయినా రమ్య మద్యం మత్తులో బిడ్డను నిర్లక్ష్యం చేస్తుందని రెండు రోజుల క్రితం మరో మారు భార్య భర్తల మధ్య తీరువ స్థాయిలో ఘర్షణ జరిగింది తాగుడు మానుకోవాలని బిడ్డను పట్టించుకోవాలని భర్త మందలించాడు. దీంతో తన కూతురు వల్లే ఇదంతా జరుగుతుందని భావించిన రమ్య తన బిడ్డను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది భర్త బయటకు వెళ్లగానే అదే అదునుగా భావించి చిన్నారి శివాని గొంతు నులిపి హత్య చేసింది. చేసిన దారుణం గురించి భర్త మల్లేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసు రమ్యను అదుపులో తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది పోస్ట్మార్టం నిమిత్తం తరలించమని ఎస్ఐ సందీప్ తెలిపారు

 

23 Jul 2025

Leave a Comment