నిజామాబాద్ A9 న్యూస్:
దళిత,బహుజన ఉద్యమ శిఖరం, మానవహక్కుల మార్గదర్శి, రచయిత ,కవి, న్యాయవాది ,పత్రికా సంపాదకుడు, త్యాగశీలి, బహుముఖ ప్రజ్ఞాశాలి బొజ్జా తారకం గారి ఏడవ వర్ధంతి, ఈ సందర్భంగా నేడు ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బొజ్జ తారకం గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి హాజరైన వివిధ దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ బొజ్జ తారకం గారి సేవలను కొనియాడారు. బొజ్జ తారకం గారు నిజామాబాద్ జిల్లాలో అనేక ప్రజా ఉద్యమ చైతన్య సదస్సులను నిర్వహించి నిరంతరం ప్రజలను చైతన్య పరిచారన్నారు అంబేద్కర్ యువజన సంఘాల స్థాపనలో క్రియాశీలకంగా వ్యవహరించారని, బీడీ కార్మికుల హక్కులకై, అగ్రకుల ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా, రెండు గ్లాసుల పద్ధతికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేసి ప్రజా ఉద్యమాలను నిర్మించారని కొనియాడారు, కారంచేడు చుండూరులో జరిగిన నర మేధానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభను ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు బెంచ్ ను కారంచెడు పురవీధుల్లో పెట్టించి దోషులకు శిక్ష వేయించారన్నారు రాబోయే రోజుల్లో ఆ మహానుభావుడి అడుగుజాడల్లో నడుస్తూ నిరంతరం
దళిత జాతి అభివృద్ధికై పోరాటం చేస్తామని ప్రతినబునారు ఈ కార్యక్రమంలో మాదిగ హక్కుల యునైటెడ్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షులు కొక్కెర భూమన్న, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కన్వీనర్ మూగ ప్రభాకర్, ఆల్ మాలా స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అంగరి ప్రదీప్, సీనియర్ అంబేద్కర్ రైట్స్ శెట్పల్లి నారాయణ, పింజా పెద్ద భోజన్న, తదితరులు పాల్గొన్నారు.