నిజామాబాద్ A9 న్యూస్:
-ఓటర్ నమోదు పరిశీలన అధికారిని క్రిస్టినా జెడ్ చొంగ్తు..
ఓటర్ నమోదు ప్రక్రియలో, మార్పులు చేర్పుల సవరణల్లో అధికారులు ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని ఓటర్ నమోదు పరిశీలన అధికారిని క్రిస్టినా జెడ్ చో0గ్తు అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్ ఏరియాలో గల జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఓటర్ నమోదు కేంద్రాన్ని ఓటర్ నమోదు పరిశీలనాధికారిని క్రిస్టినా రెవెన్యూ అధికారులతో కలిసి శనివారం సందర్శించి పరిశీలించారు. ఓటర్ నమోదు కేంద్రంలో దరఖాస్తులు ఎంతమంది చేసుకున్నారని అడిగారు.
వాటిలో నూతన ఓటర్లు ఎంతమంది అని, మరణించిన పేరు తొలగించేందుకు వచ్చిన దరఖాస్తులు ఎన్ని, తప్పుడు పేర్లను సవరణ చేసుకునేందుకు తీసుకున్న దరఖాస్తులు ఎన్ని ఉన్నాయని వివరాలను అధికారి అడిగి తెలుసుకుని ఆరా తీశారు. ఆమె వెంట జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఆర్మూర్ ఆర్డీవో వినోద్ కుమార్, తాసిల్దార్ శ్రీకాంత్, డిప్యూటీ తాసిల్దార్ విజయ్, ఆర్ ఐ అశోక్ సింగ్, మున్సిపల్ అధికారులు గంగా మోహన్, మమత, తదితరులు ఉన్నారు.