నిజామాబాద్ A9 న్యూస్:
*ఆకట్టుకున్న సంఘం శరణం గచ్చామి కళాజాత ప్రదర్శన
*తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ
ఆర్మూర్ పట్టణంలో క్షత్రియ ఫంక్షన్ హాల్ లో వెనుకబడిన కులాల అభివృద్ధి శాఖ నిజామాబాద్ జిల్లా వారి ఆధ్వర్యంలో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారిచే సాంస్కృతిక చైతన్య యాత్ర కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నవభారత నిర్మాత ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయం, లక్ష్యాల పైన కళాకారులు కళారూప ప్రదర్శన చూపరులను ఆకట్టుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎం.పీ.పీ పస్క నరసయ్య, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారులు హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి షెడ్యూల్ కులాల వసతి గృహ విద్యార్థిని విద్యార్థులు పెద్ద మొత్తంలో హాజరై మహానుభావుడు అంబేద్కర్ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను కళ్ళకు కట్టినట్లు వివరించి విద్యతో పదిమందికి జ్ఞానోదయం ఏ విధంగా కలిగించి సమాజంలో మార్పు ఏ విధంగా తీసుకురావాలో దాని కోసం అంబేద్కర్ ఏ విధంగా విధంగా కృషి చేశారు కళ్లకు కట్టినట్లు చూపించడం జరిగింది.
సమాజంలో నేడు భావి భారత తరాల కోసం అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని స్వార్థపరులు ఏ విధంగా దుర్వినియోగం చేసుకుంటున్నారో వివరిస్తూ రాజ్యాంగం ప్రతి పౌరునికి ఏ విధంగా ఉపయోగపడుతుందో నాటక రూపంలో వివరించడం జరిగింది. వివిధ వసతి గృహాల నుంచి హాజరైన విద్యార్థిని విద్యార్థులు నేడు అంతరించిపోతున్న నాటక ప్రదర్శనలు అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వాళ్లు ప్రదర్శించడం చూసి ఆనందానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన శాఖ అధికారులు మరియు బహుజన సంఘ నాయకులు వివిధ వసతి గృహాలకు సంబంధించిన విద్యార్థినీ విద్యార్థులు హాస్టల్ వార్డెన్లు తదితరులు పాల్గొనడం.