నిజామాబాద్ A9 న్యూస్:
భారతీయ జనతా పార్టీ జాతీయ మరియు రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు ద్యాగ ఉదయ్ ఆధ్వర్యంలో “నేను జన్మించిన నేల — నన్ను జన్మనిచ్చిన దేశం” “మేరీ మాటి — మేరా దేశ్” కార్యక్రమాన్ని ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి జమ్మన్ జెట్టి గల్లీలో నిర్వహించడమైనది.
ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటికి వెళ్లి కలశంలో పిడికెడు మట్టిని లేదా పిడికెడు బియ్యాన్ని తీసుకొని, కలశం తో కూడిన ఈ మట్టిని ఢిల్లీలో ఉన్నటువంటి అమరవీరుల స్థూపం వద్ద తీసుకువెళ్లి అక్కడ అమరవీరుల యొక్క ప్రాంగణంలో దేశవ్యాప్తంగా సేకరించినటువంటి మట్టిని పోసి మొక్కలను నాటి అమృత వనాన్ని నిర్మించడం జరుగుతుంది.