నందిపేట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన గ్రామసభలో
సమస్యల పరిష్కారం పై వివాదం చెలరేగింది…..
నందిపేట్ మండల కేంద్రంలోని
పదవ వార్డులో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వలన మురికి నీరు, ప్లాట్లలో రోడ్లపై వచ్చి ఆగడం జరుగుతుందని, పలుమార్లు పంచాయితీ దృష్టికి తీసుకెళ్లిన లాభం లేకుండా పోయిందని, దీనివలన స్థానిక ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారని ,స్థానిక ముస్లిం మైనార్టీ అధ్యక్షులు అహ్మద్ ఖాన్, స్థానిక వార్డు మెంబర్ రఫీ ఖాన్ గ్రామ సభలో ఆగ్రహం వ్యక్తం చేశారు,
ప్రస్తుత గ్రామాధికారికి ,స్థానిక సర్పంచ్ గారికి ఎన్నోసార్లు మెమోరండం ఇచ్చామని ,వారికి కూడా చిత్తశుద్ధి లేకపోవడంతో కనీసం వార్డు వైపు చూడడానికి కూడా రాలేదని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మురికి కాలువల మరమ్మత్తులు, డ్రైనేజీ వ్యవస్థను సరిదిద్దాలని, లేకపోతే మసీద్ దగ్గర ఉన్న రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేస్తామని, స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు……
ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామాధికారి సౌమ్య స్థానిక సాంబారు వాణి వార్డు సభ్యులు రఫీ ఖాన్ ముస్లిం మైనారిటీ అధ్యక్షులు అహ్మద్ ఖాన్ ముస్లిం యూత్ ప్రెసిడెంట్ అబుబక్కర్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు