సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన పండుగలను ప్రశాంతంగా నిర్వహించుకునే కలిసికట్టు తనం మని నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు ప్రజల సొంతమని, రానున్న వినాయక చవితి ఉత్సవాలను నిర్విఘ్నంగా జరుపుకోవడంలో ఉత్సవ కమిటీలు, యువజన సంఘాలు మీ పోలీసులకు సహాకరించాలని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ, ఐ.పి.యస్., అన్నారు.
ఈ నెల 18న వినాయకచవితి పండుగను పురస్కరించుకుని, నిజామాబాద్, ఆర్మూర్ , బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ పరిధిలలోని, అన్ని గ్రామాలలోని ఆయా వీధులలో గణపతిని ప్రతిష్టించుకునే సంఘాల వారు / కాలనీల వారు ఈ దిగువ తెలియజేసిన లింక్ ద్వారా పోలీస్ వారి అనుమతి పొందగలరు.
http://policeportal.tspolice.gov.in
ఇట్టి లింక్లో సూచించిన వివరాలు పొందుపరచి అనుమతిని ఆన్లైన్ ద్వారా తీసుకోవాలి. వినాయక ఉత్సవాలను నిర్వహించే సంఘాల వారు నిర్దేశించిన లింక్ ద్వారా విగ్రహాన్ని ప్రతిష్టించే రోజు , సమయం. దారి వివరాలను పొందరుపరచవలసి ఉంటుంది.
విగ్రహాం ప్రతిష్టించే స్థలం , సొంతదారులచే అనుమతి తీసుకున్న పత్రము జత పరచాలి. ఈ సందర్భంగా శాంతిభద్రతలకు భంగం కలిగించని, రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్న ప్రదేశాలకు మాత్రమే పోలీసు అనుమతి ఇవ్వబడును. ఉత్సవ వేదికలకు అవసరమయ్యే విద్యుత్తు కనెక్షన్ కొరకు సంబంధిత శాఖ అనుమతి తీసుకున్న పత్రము జతపరచాలి. ఉత్సవ నిర్వాహాకులు సౌండ్ బాక్స్ సిస్టమ్లను మాత్రమే వినియోగిస్తూ, శబ్ద నియంత్రణ పాటించడం అవసరం. సుప్రీమ్ కోర్టు వారి ఆదేశాల మేరకు రాత్రి పది గంటల నుండి ఉదయం ఆరు గంటల మధ్యన సౌండ్ సిస్టమ్ ఉపయోగించ రాదని తెలుపనైనది. ఉత్సవ నిర్వహకులు మండపం వద్ద గుర్తింపు కార్డులతో కూడిన వాలంటీర్లను నియమిస్తూ, భక్తులను పరుస క్రమంలో ఉంచుతూ హారతి. ప్రసాద వితరణ సందర్భంలోనూ, విద్యుత్తు నిర్వహాణ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. పోలీస్ శాఖ సూచించిన లింక్ ద్వారా మాత్రమే నిర్వాహా కులు తగు పత్రాలు జతపరచి, విగ్రహప్రతిష్ట వేడుకలకు అనుమతి తీసుకోవాలి. వేడుకల నిర్వాహాకులు లింక్ ద్వారా పొందుపరిచిన వివరాలమేరకు స్థానిక పోలీసు అధికారుల ద్వారా అనుమతి అభిస్తుందని గమనించాలి. వినాయక చవితి వేడుకలను ప్రశాంతముగా నిర్వహించడంలో స్థానిక పెద్దలు, శాంతి కమిటి సభ్యులు స్వచ్చంద సేవకులు, యువజన సంఘాల వారు మీ పోలీసుకు సహకరించాలని విజ్ఞప్తి. విగ్రహాన్ని వీధులలో ప్రతిష్ఠించేవారు. ఊరేగింపు ద్వారా నిమజ్జనం చేయాలనుకునే ప్రతి ఒక్కరు వివరాల పోలీసు దృష్టికి తీసుకెళ్లి, అనుమతి తీసుకోవడం వలన పకడ్బంది పోలీసు నిఘా ,బందోబస్తు నిర్వహణకు అవకాశం ఉంటుందని గ్రహించగలరు.
శాంతిభద్రతల పరిరక్షణలో నిజామాబాద్ ప్రజలు అందిస్తున్న సహాకారంతో మీ పోలీసు మరింత విజయవంతముగా ముందుకు వెలుతుందని ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ,IPS., తెలియజేశారు.