నిజామాబాద్ A9 న్యూస్:
ఆర్మూర్ మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని కార్మికుల ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు మద్దతు పలికిన బి.ఎల్.టి.యు రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికులకు పిఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. బకాయిలను చెల్లించకపోతే పెద్ద ఎత్తున సమ్మెకు వెళ్తామన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు.
* 8నెలల పిఆర్సి బకాయిలను వెంటనే ఇవ్వాలి.
*7 మందికి ఒక్క గ్రూప్ ఏర్పాట్లను రద్దు చేయాలి, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తరహాలో కార్మికుల ద్వారానే గ్రూపు ఏర్పాటు చేయాలి.
*పిఎఫ్, ఈఎస్ఐలో జరగని అవకతవకలను సరిచేసి విధంగా ఇద్దరు అధికారులను నియమించి 15 రోజుల్లో పరిష్కారం చేయాలి అని అన్నారు.
*ప్రతినెల 5వ తేదీ వరకు వేతనాలు వెయ్యాలని కోరారు.
*పెండింగ్లో ఉన్న వంటి రెండు నెలల వేతనాలు వెంటనే ఇవ్వాలి.
*కార్మికులకు బట్టలు, రైన్ కోట్లు, చెప్పులు, నూనెలు, చీపుర్లు, ఇతర వాటర్ సప్లై గార్డెన్స్, వీధిలైట్ల కార్మికులకు పరికరాలు ఇవ్వాలి.
*వాహనాలకు రిపేర్లకు అయ్యే ఖర్చు మొత్తం మున్సిపాలిటీ భరించాలి.
*మున్సిపల్ కార్మికులకు సంవత్సరానికి 15 సిఎల్ లు ఇవ్వాలి.
పైన పేర్కొన్న విధంగా వారం రోజుల్లో పరిష్కరించకపోతే 20వ తేదీ నుండి సమ్మెకు దిగుతామని తెలియజేశారు.