గత రెండేళ్లుగా కన్నడ సినిమాలు అన్ని భాషల సినిమాలను డామినేట్ చేస్తున్నాయి. సొంత కథలను తీయకుండా.. రీమేక్‌లను నమ్ముకుంటారు అంటూ కేజీఎఫ్ ముందు వరకు విమర్శలు పాలైన ఇండస్ట్రీ ఇప్పుడు అవుట్ ఆఫ్ ది బాక్స్ సినిమాలు తీస్తూ ఔరా అనిపిస్తుంది.
గత రెండేళ్లుగా కన్నడ సినిమాలు అన్ని భాషల సినిమాలను డామినేట్ చేస్తున్నాయి. సొంత కథలను తీయకుండా.. రీమేక్‌లను నమ్ముకుంటారు అంటూ కేజీఎఫ్ ముందు వరకు విమర్శలు పాలైన ఇండస్ట్రీ ఇప్పుడు అవుట్ ఆఫ్ ది బాక్స్ సినిమాలు తీస్తూ ఔరా అనిపిస్తుంది. కేజీఎఫ్, కాంతార, చార్లీ777, విక్రాంత్ రోణ ఇలా కంటెంట్ కథలతో వచ్చి కోట్లు కొల్లగొడుతున్నాయి. ఇప్పుడదే తరహాలో మరో సినిమా తెలుగులో సంచలనాలు సృష్టించడానికి రెడీ అవుతుంది. అదే సప్త సాగరదాచే ఎల్లో సైడ్-ఏ. దీనికి తెలుగులో ఎక్కడో ఏడు మహాసముద్రాలు దాటి అనే అర్థం వస్తుంది. రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న కన్నడలో రిలీజై ఊహించిన రేంజ్‌లో రెస్పాన్స్ తెచ్చుకుంది.
బెంగళూరులో మంగళవారం సైతం కొన్ని థియేటర్‌లలో ఈ సినిమాకు టిక్కట్లు దొరకని పరిస్థితి ఏర్పడిందంటే ఏ రేంజ్‌లో ఈ సినిమా ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ వంటి నగరాల్లో ఈ సినిమా కన్నడ వెర్షన్ రిలీజైంది. ఇప్పటికే చాలా మంది కన్నడ వెర్షన్‌లోనే సినిమా చూశారు. ఇదొక హార్డ్ హిట్టింగ్ లవ్‌స్టోరీ అని, గుండెల్ని పిండేసే సినిమా అని ఈ మూవీని చూసిన కొందరు తమ సమీక్షలు తెలిపారు. ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయని.. ఎట్టి పరిస్థితుల్లో థియేటర్‌లో ఎక్స్‌పీరియెన్స్ చేయాల్సిన సినిమా అని చెప్పుకొచ్చారు. కాగా అలాంటి రివ్యూలు తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు తెలుగు రిలీజ్‌కు రెడీ అవుతుంది. తాజాగా ఈ సినిమా హీరో, నిర్మాత రక్షిత్ శెట్టి స్వయంగా ఈ విషయాన్ని చెప్పాడు. ప్రస్తుతం తెలుగు డబ్బింగ్ పనులు జరుగుతున్నాయని, సరైన డేట్ చూసి రిలీజ్ చేస్తామని చెప్పాడు.
ఈ అప్‌డేట్‌తో సినీ లవర్స్ ఎప్పుడెప్పుడు తెలుగులో వస్తుందా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కథ విషయానికొస్తే.. మను, ప్రియ అనే మధ్య తరగతికి చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటుంటారు. పెళ్లిచేసుకుని జీవితంలో చాలా సాధించాలని, గొప్పగా ఎదగాలని కలలు కంటుంటారు. మరీ ముఖ్యంగా సముద్రం పక్కన ఓ అందమైన ఇల్లు కట్టుకుని కుంటుంబంతో కలిసి హ్యాపీగా జీవించాలని అనుకుంటారు. అయితే ఓ రాంగ్ డిసీషన్ వల్ల వీళ్ల జీవితాలు తలకిందులైపోతాయి. రక్షిత్ శెట్టి జైలుకు అంకితమైపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? రక్షిత్ శెట్టి జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? చివరకి జైలు నుంచి రక్షిత్ బయటకు వచ్చాడా? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.
కథ వింటుంటో ఇదో థ్రిల్లింగ్ సినిమాల అనిపించొచ్చు. కాగా ఇదే కథను ఇద్దరి ప్రేమికులతో లింకప్ చేసిన దర్శకుడు హేమంత్ ప్రతిభకు కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. సినిమా చూస్తున్నంత సేపు ఓ భావోద్వేగానికి ఫీలవుతూనే ఉంటాం. ఇక ఈ సినిమాలో హీరో హీరోయిన్‌లుగా నటించిన రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ టెర్రిఫిక్ పర్‌ఫార్మెన్స్‌కు ఫిదా అవని ప్రేక్షకుడు లేడు. మరీ ముఖ్యంగా రుక్మిణి నటన వర్ణణాతీతం. పైగా ఇది ఆమెకు తొలిసినిమా. తొలి సినిమాలోనే ఈ రేంజ్‌లో నటనతో క్లాప్స్ కొట్టించుకుందంటే మాములు విషయం కాదు. ఇక ఈ సినిమాను రక్షిత్ శెట్టి తన స్వంత బ్యానర్‌పై నిర్మించాడు.