నిజామాబాద్ A9 న్యూస్:
ఆర్మూర్ పట్టణ కేంద్రం మామిడిపల్లి లో తపస్వి స్వచ్ఛంద సంస్థ లో జేసీఐ ఇందూర్ ఆధ్వర్యంలో స్వామి బాయ్ బ్లడ్ ఫౌండేషన్ ఫౌండర్ మాదరి స్వామి కి శాలువాతో ఘనంగా సన్మానం చేశారు, మరియు మెమొంటో అందించారు.
ఈ సందర్బంగా జోన్ డైరెక్టర్ జయంత్ శెట్టి మరియు జేసీఐ ఇందూర్ అధ్యక్షులు నాయన జిల్కర్ మాట్లాడుతూ జేసీఐ ప్రతి సంవత్సరం కూడా సమాజ సేవ చేస్తూ సమాజానికి ఆదర్శంగా ఉన్న గొప్ప వ్యక్తులకు వారి సేవలను గుర్తించి వారికి సత్కరిస్తారు అలాగే ఈ సంవత్సరం కూడా ఆర్మూర్ పట్టణ కేంద్రంలో స్వామి బాయ్ బ్లడ్ ఫౌండేషన్ ఫౌండర్ అయినటువంటి మాదరి స్వామి ఒక పక్క హోమ్ గార్డ్ గా ఉద్యోగం చేస్తూ మరో పక్క బ్లడ్ ఫౌండేషన్ నడుపుతూ దాదాపు 450 పైగా పేషెంట్స్ కు డోనర్ల ద్వారా బ్లడ్ డొనేట్ చేయటం జరిగింది ఇలా అనేక మందికి స్వామి ప్రాణదాతగా ఉన్నారు మరియు సహాయం అందించారు.
అంతేకాకుండా ఓకే ఆదర్శంగా కూడా నిలిచారు. ఇలా స్వామి లా అందరూ కూడా ముందుకు వచ్చి సమాజంలో మంచి మార్పుకై సేవ చేయాలనీ వారు అన్నారు. అంతేకాకుండా మాదరి స్వామి మాట్లాడుతూ ముందుగా నా సేవ గుర్తించి నాకు.
ఈ సన్మానం చేసిన జేసీఐ సంస్థకు శిరస్సువంచి నా నమస్కారాలను తెలుపుతున్నాను అంతేకాకుండా అన్ని దానాల కంటే ప్రాణదానం గొప్పదని అందులో ఒక మనిషి ఇంకో మనిషికి ఇచ్చే గొప్ప దానం రక్తదానం కాబట్టి అందరూ కూడా ముందు వచ్చి ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసి వారి ప్రాణాలను కాపాడండి వారు కోరారు ముఖ్యంగా ఇప్పుడున్న యువత ఇలా సమాజ సేవకై వాళ్లు కృషి చేయాలని దేశాన్ని ఉన్నత స్థాయిలో ఉంచాలని రానున్న రోజుల్లో తన శక్తి మేరకు ఇలా సమాజ సేవ చేస్తానని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో జేసీఐ మాజీ అధ్యక్షులు జిల్కర్ విజయానంద్, సభ్యులు యదేశ్, వినోద్, సుబ్రహ్మణ్యం, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.