నిజామాబాద్ A9 న్యూస్:
దోబీ ఘాట్ వద్దగల చాకలి ఐలమ్మ విగ్రహానికి ఆరోగ్యశాఖ చైర్మన్ సర్జన్ డాక్టర్ ఎం. జె మధు శేఖర్ అలాగే చేయూత సంస్థ మానస గణేష్ కాజా పాషా ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ నాగరాజు సామ కృష్ణ పటేల్. చాకలి ఐలమ్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. రాజు, రాము, సాయి, బాలు, జెండాగల్లి బి. రమేష్, దోబి గల్లి డాక్టర్ రాజన్న తదితరులు పాల్గొన్నారు .అనంతరం చేయూత సంస్థ మానస గణేష్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ చేసిన త్యాగాలను ఆమె చేసిన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని స్మరించారు. అనంతరం రాష్ట్ర ఆరోగ్యశాఖ చైర్మన్ సర్జన్ డాక్టర్ ఎం .జె మధు శేఖర్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ త్యాగం చాలా గొప్పదని అనగారిన వర్గాలను ఐకమత్యంతో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఎంతో త్యాగం చేసిన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ఆడది అబల కాదు సబల అని నిరూపించిన మొట్టమొదటి వ్యక్తి ,అలాగే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణసాయుధ పోరాటంలో ముందుండి పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మను ఎప్పటికీ మర్చిపోలేము అని తెలిపారు.