నిజామాబాద్ A9 న్యూస్:
ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి నీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తమ పూర్తి మద్దతు తెలుపుతూ ఆర్మూర్ మండల గోత్రాల సంఘం సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేసుకోవడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని రామ్ నగర్ కాలనీలో గల విరామ ఉపాధ్యాయుడు నర్సింగ్ ఆధ్వర్యంలో సంఘ సభ్యులు సమావేశమై ఈ తీర్మానాన్ని చేసుకొని తీర్మానప్రతులను ఆర్మూర్ బీ.ఆర్.ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆశన్నగారి రాజేశ్వర్ రెడ్డి కి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ నాయకులు పండిత్ పవన్, కౌన్సిలర్ గంగ మోహన్ చక్రు తదితరులు పాల్గొనడం.