Wednesday, November 27, 2024

విజయ్‌ హైస్కూల్‌లో మాతృమూర్తుల సమావేశం

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

నిజామాబాద్ A9 న్యూస్:

ఆర్మూర్‌ పట్టణం విజయ్‌ హైస్కూల్‌, మామిడిపల్లిలో పాఠశాల విద్యార్థుల మాతృమూర్తుల సమావేశాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు టి. కవితాదివాకర్‌ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది.  

ఈ మాతృమూర్తుల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయ్‌ విద్యాసంస్థల అధినేథ డా. అమృతలత మాట్లాడుతూ ఉపాధ్యాయులకు, విద్యార్థుల మాతృమూర్తులకు మద్య అవగాహన పెరగడానికి పిల్లల చదువు – క్రమశిక్షణ, వారి అభివృద్ధి – వికాసం పరీక్ష విధానంపై సందేశాలను తీర్చి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. మరియు మాతృమూర్తుల సూచనల పట్ల స్పందించి సమయస్ఫూర్తితో పరిష్కరించి సమావేశం సహృద్భావ వాతావరణంలో జరిపించారు.

తదనంతరం మాతృమూర్తులను ఉల్లాస పరచడానికి త్రోబాల్‌, బాంబ్‌ ఇన్‌ ద సిటీ, సోలో డాన్స్‌ తదితర పోటీలు నిర్వహించారు. ఇందులో గెలుపొందిన మాతృమూర్తులకు పాఠశాల వార్షికోత్సవం రోజున బహుమతులు అందజేస్తామని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here