నిజామాబాద్ A9 న్యూస్:

భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు ద్యాగ ఉదయ్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ధోబి ఘాట్ వద్ద ఉన్న ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడమైనది.

 

ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ…

 

తెలంగాణను పరిపాలిస్తున్న రజాకార్లు రైతులు పండించిన పంట లోని సగభాగాన్ని అక్రమంగా తీసుకోవడమే కాకుండా ఆ పంటలకు పన్నులు విధించడాన్ని వ్యతిరేకిస్తూ చాకలి ఐలమ్మ రజాకార్లకు వ్యతిరేకంగా గలమెత్తి పోరాటం చేయడమైందని. గొడ్డలి చేతబట్టి రజాకార్లను ఎదిరించి నిలిచి ప్రతి మహిళకు స్పూర్తిగా నిలబడి తన లక్ష్యాన్ని చేరడానికై చివరికి తన భర్తను సైతం కోల్పోయినప్పటికీ అధైర్య పడకుండా, వెనకడుగువేయకుండా రజాకార్లతో పోరాటం చేసి రైతులకు అండగా నిలిచి, రైతులకు న్యాయం చేయడం జరిగిందని. అదేవిధంగా అదే స్ఫూర్తితో తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఈ నిజాం సర్కార్ ను నడుపుతున్న నయా నిజాం సర్కార్ కేసీఆర్ ను ఏవిధంగానైతే చాకలి ఐలమ్మ ఆయుధాన్ని చేత బట్టి రజాకార్లను ఎదిరించి ఉద్యమాన్ని ఉదృతం చేసిందో అదే విధంగా రాబోయే కాలంలో తెలంగాణ ప్రజలు ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి నయా నిజాం సర్కార్ కేసీఆర్ ను గద్దెదించి భారతీయ జనతా పార్టీని బలపరచవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేయడమైనది.

 

ఈ కార్యక్రమంలో బిజెపి ఆర్మూర్ పట్టణ ఉపాధ్యక్షులు పల్లె శ్రీనివాస్, ఆర్మూర్ పట్టణ కార్యదర్శి పులి యుగంధర్, దళిత మోర్చ ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి కృష్ణ, ఓబిసి మోర్చా ఆర్మూర్ పట్టణ కార్యదర్శి గటడి శివ, భవాని రాము, బలరాం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *