నిజామాబాద్ A9 న్యూస్:
ఆర్మూర్ పట్టణంలోని పత్రిక సమావేశం నిర్వహించిన యూత్, ఎన్.ఎస్.యు.ఐ, ఈ సందర్బంగా పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి షేక్ పాషా, యూత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ అరిగేల భావేష్, ఎన్.ఎస్.యు.ఐ, జిల్లా ప్రధాన కార్యదర్శి సుద్దపల్లి అఖిల్ లు మాట్లాడుతూ వినయ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్బంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు దుండగులు చింపివేశారు అని, అవి చింపివేసింది ఎవరో ఏ పార్టీకి చెందినవారో ప్రజలందరికి తెలుసు అని అన్నారు.
కేవలం వినయ్ రెడ్డి ఫ్లెక్సీలకే ఇంత భయపడితే ఎన్నికలు సమిపించే లోపు దుకాణం ఎత్తేస్తారు అని అన్నారు, ఫ్లెక్సీలు చింపివేసిన వారికి మరియు వారిని ప్రోత్సహించిన వారికి మేము చెప్తున్నము మీకు దమ్ముంటే రాజకీయంగా ఎదురుకొండి కాని ఫ్లెక్సీలు చింపుతూ చిల్లర రాజకీయలు చేయటం పిరికిపంద చర్య అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అబ్దుల్ వాసి, ఇర్ఫాన్, ఆదిత్య, ముస్తాక్, అస్లాం తదితరులు పాల్గొన్నారు.