Monday, November 25, 2024

షారుఖ్ సినిమా రెండో రోజూ అదే ప్రభంజనం, తగ్గేదే లే !

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

‘జవాన్’ హవా ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర కొనసాగుతోంది. రెండో రోజు కూడా షా రుఖ్ ఖాన్ సినిమా కలెక్షన్స్ అదిరిపోయేట్టు చేసింది. షారుఖ్ ఖాన్ మరోసాటి తన బలం ఏంటో ఈ ‘జవాన్’ తో చూపించాడు. ఒక పెద్ద విజయం దిశగా ఈ సినిమా దూసుకెళుతోంది అని అంటున్నారు.

 

షారుఖ్ ఖాన్ (ShahRukhKhan) నటించిన ‘జవాన్’ #Jawan సినిమా గురువారం నాడు చాలా బ్రహ్మాండంగా విడుదలైంది. అట్లీ (Atlee) దీనికి దర్శకుడు, కాగా ఇందులో నయనతార (Nayanthara) కథానాయిక కాగా విజయ్ సేతుపతి (VijaySethupathi), ప్రియమణి (Priyamani), దీపికా పడుకోన్ (DeepikaPadukone) ఇంకా చాలామంది నటులు ముఖ్య పాత్రలు పోషించారు. మొదటి రోజు రికార్డు కలెక్షన్లతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక ప్రభంజనం సృష్టించిన ఈ ‘జవాన్’ సినిమా రెండో రోజు కూడా అదే హవా కొనసాగించింది.

 

మొదటి రోజు ఈ సినిమా సుమారు రూ.129 కోట్లు వసూల్ చేసి బాలీవుడ్ లో ఒక చరిత్ర సృష్టించిన సంగతి కూడా తెలిసిందే. రెండోజు కూడా అదే హవా కొనసాగించి సుమారు రూ. 53 కోట్ల వరకు రెండో రోజు కలెక్టు చేసిందని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ రెండు విభిన్న పాత్రల్లో కనపడతారు.

jawan-shahrukhkhan.jpg

మొత్తం సినీమా పరిశ్రమ అంతా ఇప్పుడు ‘జవాన్’ వైపు ఆసక్తికరంగా గమనిస్తోంది. ఈ సినిమా వసూళ్ల సునామీ ఏ రేంజ్‌‌కి వెళుతుందా అని ట్రేడ్ వర్గాలు ఆతృతగా ఉన్నాయి. ఈ సిినిమాను అనౌన్స్ చేసిన రోజు నుంచే సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు సినిమా ట్రైలర్‌లతో ఈ అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇక సినిమా ఈ అంచనాలను మించి ఉండటంతో అభిమానుల ఆనందానికి మాటలు లేవనే చెప్పాలి. అంతటా జవాన్ మానియా అలుముకుంది అనే చెప్పాలి.

ఇక ఈరోజు అంటే శనివారం, రేపు ఆదివారం రెండు రోజులూ ఈ సినిమా కలెక్షన్స్ ఇంకా పెరుగుతాయని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు. ఎందుకంటే ఇందులో షారుఖ్ ని ఒక మాస్ అవతారంలో దర్శకుడు అట్లీ చూపించాడని, అతన్ని ఆలా చూసిన అభిమానులు రెండో సారి కూడా ఈ సినిమా చూడటానికి వస్తున్నారని కూడా అంటున్నారు. అందుకని సినిమా కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం వుంది అని తెలుస్తోంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా కలెక్షన్స్ చాలా బాగున్నాయని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 5 కోట్లు కలెక్టు చేసిన ఈ సినిమా, రెండో రోజు సుమారు రూ. 4 కోట్లు వరకు కలెక్టు చేయవచ్చని తెలుస్తోంది.

Website | + posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here