‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ మూవీతో టాలీవుడ్‌‌కు పరిచయమైన నటుడు సుధాకర్ కోమాకుల నటించిన తాజా చిత్రం ‘నారాయణ అండ్ కో’. ఈ మూవీ జూన్ 30వ తేదీన థియేటర్లోకి వచ్చి మంచి స్పందననే రాబట్టుకుంది. తాజాగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

 

‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ (Life Is Beautiful) మూవీతో టాలీవుడ్‌‌కు పరిచయమైన నటుడు సుధాకర్ కోమాకుల (Sudhakar Komakula) నటించిన తాజా చిత్రం ‘నారాయణ అండ్ కో’ (Narayana and Co). ఈ మూవీ జూన్ 30వ తేదీన థియేటర్లోకి వచ్చి మంచి స్పందననే రాబట్టుకుంది. పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్, సుఖ మీడియా పతాకాలపై పాపిశెట్టి బ్రదర్స్‌ సహకారంతో సుధాకర్‌ ఈ మూవీని నిర్మించారు. శ్రీనివాస్ గొర్రిపూడి ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించారు. చిన పాపిశెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ‘ది తిక్కల్ ఫ్యామిలీ’ అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

 

థియేటర్‌లో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు నారాయణ అండ్ కో సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో వీక్షించవచ్చు. నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌ చుట్టూ తిరిగే కథతో ఫన్‌ ఎలిమెంట్స్‌‌తో ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంది. మధ్య తరగతి కుటుంబాన్ని లీడ్‌ చేసే యజమాని నారాయణ పాత్రలో దేవీ ప్రసాద్ ప్రేక్షకులను తనదైన శైలిలో అలరించాడు. అతని భార్య పాత్రలో సీనియర్ నటి ఆమని నటించగా… కొడుకు పాత్రలో సుధాకర్ నటించి మెప్పించాడు. (Narayana and Co in Amazon Prime)

sudhakar.jpg

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. నారాయణ(దేవి ప్రసాద్) అనే ఓ కుటుంబ పెద్ద. భార్య (ఆమని), తన ఇద్దరు కొడుకులు ఆనంద్ (సుధాకర్ కోమాకుల), సుభాష్ (జై కృష్ణ)లతో చాలా సాధారణ జీవితం గడుపుతుంటాడు. ఆనంద్ బెట్టింగ్స్‌లో చాలా డబ్బు పోగొట్టుకుంటాడు. మరి ఈ క్రమంలో ఆనంద్ ది ఓ ప్రైవేట్ వీడియో ఉందంటూ ఒక బ్లాక్ మైలర్ అతన్ని డబ్బులు డిమాండ్ చేస్తాడు. మరోవైపు నారాయణకు కూడా ఊహించని ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతాయి. మరి ఈ కష్టతర పరిస్థితుల్లో ఈ ఫ్యామిలీ ఎలాంటి డెసిషన్ తీసుకుంది? అనే విషయం తెలియాలంటే హిలేరియస్ కామెడీతో నడిచే ఈ సినిమాని చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *