Monday, November 25, 2024

‘ఏజెంట్’ ఏమోగానీ.. ‘రామబాణం’ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘ఏజెంట్’, గోపీచంద్ హీరోగా నటించిన ‘రామబాణం’ సినిమాలు విడుదలై చాలా కాలం అవుతుంది. థియేటర్లలో మిక్స్‌డ్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకున్న ఈ చిత్రాలు.. విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీలో వస్తాయని అంతా ఊహించారు. కానీ ఈ సినిమాలు ఓటీటీలో ఇంత వరకు విడుదల కాలేదు. తాజాగా ‘రామబాణం’ ఓటీటీ విడుదలకి సంబంధించిన ప్రకటనని నెట్‌ఫ్లిక్స్ సంస్థ విడుదల చేసింది.

అఖిల్ అక్కినేని (Akhil Akkineni) హీరోగా నటించిన ‘ఏజెంట్’ (Agent), గోపీచంద్ (Gopichand) హీరోగా నటించిన ‘రామబాణం’ (Rama Banam) సినిమాలు విడుదలై చాలా కాలం అవుతుంది. థియేటర్లలో మిక్స్‌డ్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకున్న ఈ చిత్రాలు.. విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీలో వస్తాయని అంతా ఊహించారు. అందుకే థియేటర్లకు వెళ్లకుండా ఓటీటీలో చూడాలని ఫిక్స్ అయ్యారు. కానీ ఈ సినిమాలు ఇంత వరకు ఓటీటీలోకి రాలేదు. వీటిలో ఇప్పుడు ‘రామబాణం’ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి ఓ గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ సినిమా ఓటీటీ విడుదలకు డేట్ ఫిక్సయింది. మరోవైపు ‘ఏజెంట్’ సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించి రెండు మూడు డేట్స్ అనౌన్స్ చేశారు కానీ.. ఇంత వరకు ఆ సినిమా ఓటీటీలోకి రాలేదు. ఎప్పుడు వస్తుందో కూడా అప్‌డేట్ అయితే లేదు.

Akhil.jpg

‘రామబాణం’ విషయానికి వస్తే.. గోపీచంద్, జగపతిబాబు అన్నదమ్ములుగా నటించిన ఈ సినిమా పీపుల్‌ మీడియా ప్యాక్టరీ పతాకంపై తెరకెక్కింది. డింపుల్‌ హయాతి హీరోయిన్‌గా నటించగా.. శ్రీవాస్‌ దర్శకత్వం వహించారు. కోలీవుడ్ సీనియర్ నటి ఖుష్బూ జగపతిబాబు భార్యగా నటించారు. మే 5న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. అంతకు ముందు గోపీచంద్, జగపతిబాబు కాంబినేషన్‌లో శ్రీవాస్ ‘లక్ష్యం’ అనే సినిమా చేసి మంచి హిట్ కొట్టారు. కానీ ఈ సినిమా విషయంలో ఆ మ్యాజిక్ మళ్లీ రిపీట్ చేయలేకపోయారు. అందుకే థియేటర్లలో ఈ సినిమాని చూడటానికి ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఓటీటీలో ఎప్పుడెప్పుడు వస్తుందా? అని మాత్రం ఎదురుచూస్తున్నారు. అలా ఎదురు చూసే వారందరి కోసం నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ‘రామబాణం’ సినిమాని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబరు 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకురాబోతున్నట్లుగా అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

Rama-Banam.jpg

‘రామబాణం’ కథ విషయానికి వస్తే.. రాజారాం (జగపతి బాబు), అతని భార్య భువనేశ్వరి (ఖుష్బూ) రఘురామ పురం అనే వూర్లో ఆర్గానిక్ హోటల్ నడుపుతూ ఉంటారు. అదే వూర్లో పాపారావు (నాజర్) అనే విలన్ కూడా ఉంటాడు, రాజారామ్ హోటల్ మూయించాలని చూస్తూ ఉంటాడు. రాజారాం తమ్ముడు విక్కీ (గోపీచంద్) అన్నయ్యలా సంయమనం పాటించడు, దెబ్బకు దెబ్బ అనే మనిషి. ఒకసారి పాపారావు, రాజారాం హోటల్‌కి వచ్చి బెదిరిస్తే, వాడిని విక్కీ కొడతాడు. తమ్ముడు చేసింది తప్పు అంటాడు రాజారాం, కానీ విక్కీ అదే రైటు అంటాడు. ఇద్దరూ వాదించుకుంటారు. ఈ వాదన పెరిగి విక్కీ ఊరు వదిలి కలకత్తా పారిపోయి వరకు వస్తుంది. కలకత్తా వెళ్లిన విక్కీ అక్కడ పెద్ద డాన్‌గా ఎదుగుతాడు. అక్కడే భైరవి (డింపుల్ హయాతి) తో ప్రేమలో పడతాడు. కానీ భైరవి తండ్రి (సచిన్ ఖేడ్కర్) ఈ పెళ్ళికి ఒక షరతు పెడతాడు, విక్కీకి కుటుంబం ఉంటేనే పెళ్లి చేస్తానని. దీంతో 14 సంవత్సరాల తర్వాత విక్కీ తనకి కుటుంబం ఉందని చెప్పి మళ్ళీ అన్న దగ్గరకి వస్తాడు. వచ్చిన రెండు మూడు రోజులు బాగానే ఉంటుంది, కానీ ఆ తరువాతే అన్నకి సమస్య, తనకి కూడా సమస్యలు వస్తాయి. ఇంతకీ ఏమిటా సమస్యలు, విక్కీ, భైరవి లు వివాహం చేసుకున్నారా లేదా? చివరికి ఏమైంది? అనేదే ఈ ‘రామబాణం’ కథ.

Website | + posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here