విజయ్ దేవరకొండ, సమంతల కాంబినేషన్‌లో శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రం ‘ఖుషి’. సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. ఈ సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. అక్టోబర్ 6న ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha)ల కాంబినేషన్‌లో శివ నిర్వాణ (Shiva Nirvana) తెరకెక్కించిన చిత్రం ‘ఖుషి’ (Kushi). సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ (Mythri Movie Makers)పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. విడుదలైన మూడు రోజులలోనే దాదాపు ఈ సినిమా రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం థియేటర్లలో స్టడీగానే నడుస్తున్న ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సంబంధించి ఇప్పుడొక వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ‘ఖుషి’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ని ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. (Kushi OTT Release Date)
‘ఖుషి’ డిజిటల్ రైట్స్‌ను సినిమా విడుదలకు ముందే నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకొంది. పాన్ ఇండియా స్థాయిలో.. విజయ్ దేవరకొండ, సమంతకు వున్న ఉన్న క్రేజ్‌తో ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులు రూ. 90 కోట్లకు అమ్ముడయినట్లుగా.. ఈ సినిమా విడుదలకు ముందే వార్తలు వచ్చాయి. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకోగా.. అక్టోబర్ 6న ‘ఖుషి’ సినిమాని డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ చేస్తున్నట్లుగా సమాచారం. అక్టోబర్ 6న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ‘ఖుషి’ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. (Kushi OTT Streaming Date Locked)
‘ఖుషి’ కథ విషయానికి వస్తే.. విప్లవ్ (విజయ్ దేవరకొండ) బీఎస్ఎన్ఎల్‌లో పని చేస్తూ ఉంటాడు. కశ్మీర్‌లో పోస్టింగ్ కావాలని అక్కడకి వెళతాడు. అక్కడ బేగం (సమంత) ను చూసి.. మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. బేగం తెలుగు అమ్మాయి అయినా విప్లవ్‌ని తప్పించుకోవడానికి పాకిస్తాన్ దేశం నుండి వచ్చాను అని, తమ్ముడు తప్పిపోయాడు అని అబద్ధం చెపుతుంది. అయినా విప్లవ్ ఆమెని ముస్లిం అమ్మాయి అనే అనుకుంటూ ఆమె మీద ఇంకా ప్రేమ పెంచుకుంటాడు, సిన్సియర్‌గా ఆమె తమ్ముడు నిజంగా తప్పిపోయాడు అనుకొని వెతుకుతూ ఉంటాడు. విప్లవ్ ఆమెకి తెలుగు రాదనుకొని ఆమెని ఎంత గాఢంగా ప్రేమిస్తున్నది తెలుగులో చెబుతూ ఉంటాడు. అవన్నీ విని ఆమె కూడా విప్లవ్‌ని ఇష్టపడటం మొదలుపెడుతుంది. అయితే.. ఉన్నట్టుండి పాకిస్తాన్ వెళ్ళిపోతున్నాను అని బేగం అద్దం మీద ఒక మూడు లైనులు రాసి వెళ్ళిపోతుంది. విప్లవ్ రైల్వే స్టేషన్‌కి వెళ్లి వెతికితే బేగం హైదరాబాద్ వెళ్లే ట్రైన్‌లో కనపడుతుంది. ఇక లాభం లేదని నిజం చెప్పేస్తుంది. తాను బ్రాహ్మణ అమ్మాయి అని, ఊరు కాకినాడ, పేరు ఆరాధ్య అని చెబుతుంది. ప్రముఖ హిందూ ప్రవచన కర్త చదరంగం శ్రీనివాసరావు (మురళీ శర్మ) కుమార్తె అని కూడా చెబుతుంది. విప్లవ్ తండ్రి, ప్రముఖ నాస్తికుడు లెనిన్ సత్యం (సచిన్ ఖేడేకర్).. వీళ్లిద్దరికీ అసలు పడదు. టీవీ డిబేట్స్‌లో కూడా వాదించుకుంటూ వుంటారు. అలాంటిది ఈ ఇద్దరూ తండ్రులు తమ పిల్లల పెళ్ళికి ఎలా ఒప్పుకున్నారు? వాళ్ల మాట కాదని పెళ్లి చేసుకున్న విప్లవ్, ఆరాధ్య కలిసి కాపురం చేయగలిగారా? ఇంతకీ కథ ఎటు మలుపులు తిరిగింది? అనేది ‘ఖుషి’ స్టోరి. (Kushi Movie Story)