Monday, November 25, 2024

విజయ్ దేవరకొండ, సమంతల జోడీ బాగుంది

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ‘ఖుషి’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో విజయ్ దేవరకొండ, సమంత జోడీగా నటించారు. వీఎళ్లిదరి ముందు సినిమాలు ప్లాప్ అయ్యాయి, అందుకని ఈ ఇద్దరూ ఈ సినిమా మీదే చాలా నమ్మకం పెట్టుకున్నారు, మరి ఆ నమ్మకం నిజమైందా…

సినిమా: ఖుషి
నటీనటులు: విజయ్ దేవరకొండ, సమంత, సచిన్ ఖేడేకర్, మురళి శర్మ, రోహిణి, లక్ష్మీ, శరణ్య, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు

ఛాయాగ్రహణం: జి మురళి

సంగీతం: హెషామ్ అబ్దుల్ వాహాబ్ (HeshamAbdulWahab)

నిర్మాతలు: నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి

కథ, కథనం, మాటలు, సాహిత్యం, దర్శకత్వం: శివ నిర్వాణ

— సురేష్ కవిరాయని

విజయ్ దేవరకొండ (VijayDeverakonda), సమంత (Samantha) జంటగా నటించిన ‘ఖుషి’ #Khushi సినిమా ఈరోజు విడుదలైంది. దీనికి శివ నిర్వాణ (ShivaNirvana) దర్శకుడు. విజయ్, సమంత ఇద్దరికీ ఈ సినిమా చాలా కీలకం, ఎందుకంటే ఇద్దరికీ ముందు సినిమాలు డిజాస్టర్ లు అయ్యాయి, అందుకని ఈ ఇద్దరూ ఈ సినిమా మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. శివ నిర్వాణ తను ఇంతకు ముందు చేసిన సినిమాలతో ఒక క్లాసిక్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు, అతని బలం అతని రచనలో వుంది. (Khushi film review) మలయాళంలో చాలా సినిమాలకి పని చేసిన అబ్దుల్ వాహాబ్ (HeshamAbdulWahab) ఈ సినిమాతో తెలుగులో సంగీత దర్శకుడిగా అడుగు పెడుతున్నాడు. ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటం, అలాగే పాటలు బాగా వైరల్ అవటం ఈ సినిమా మీద కొంచెం అంచనాలు వున్నాయి. మరి సినిమా ఎలా వుందో చూద్దాం. #KhushiFilmReview

khushi-new1.jpg

Khushi story కథ:

విప్లవ్ దేవరకొండ (విజయ్ దేవరకొండ) బీఎస్ఎన్ఎల్ లో పని చేస్తూ ఉంటాడు, కాశ్మీర్ లో పోస్టింగ్ కావాలని అక్కడకి వెళతాడు. అక్కడ బేగం (సమంత) ను మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. బేగం తెలుగు అమ్మాయి అయినా విప్లవ్ ని తప్పించుకోవడానికి పాకిస్తాన్ దేశం నుండి వచ్చాను అని, తమ్ముడు తప్పి పోయాడు అని అబద్దం చెపుతుంది. అయినా విప్లవ్ ఆమెని ముస్లిం అమ్మాయి అనే అనుకుంటూ ఆమె మీద ఇంకా ప్రేమ పెంచుకుంటాడు, సిన్సియర్ గా ఆమె తమ్ముడు నిజంగా తప్పిపోయాడు అనుకొని వెతుకుతూ ఉంటాడు. విప్లవ్ ఆమెకి తెలుగు రాదనుకొని ఆమెని ఎంత గాఢంగా ప్రేమిస్తున్నది తెలుగులో చెపుతూ ఉంటాడు, ఇవన్నీ విని ఆమె కూడా విప్లవ్ ని ఇష్టపడటం మొదలుపెడుతుంది. #KhushiReview ఉన్నట్టుండి పాకిస్తాన్ వెళ్ళిపోతున్నాను అని బేగం అద్దం మీద ఒక మూడు లైనులు రాసి వెళ్ళిపోతుంది, విప్లవ్ రైల్వే స్టేషన్ కి వెళ్లి వెతికితే బేగం హైదరాబాద్ వెళ్లే ట్రైన్ లో కనపడుతుంది. #KhushiFilmReview ఇక లాభం లేదని నిజం చెప్పేస్తుంది, తాను బ్రాహ్మణ అమ్మాయి, కాకినాడ, తన పేరు ఆరాధ్య అని. ప్రముఖ హిందూ ప్రవచన కర్త చదరంగం శ్రీనివాసరావు (మురళీ శర్మ) కుమార్తె అని కూడా చెబుతుంది. విప్లవ్ తండ్రి, ప్రముఖ నాస్తికుడు లెనిన్ సత్యం (సచిన్ ఖేడేకర్), వీళ్లిద్దరికీ అసలు పడదు, టీవీ డిబేట్స్ లో కూడా వాదించుకుంటూ వుంటారు. అలాంటిది ఈ ఇద్దరూ తండ్రులు తమ పిల్లల పెళ్ళికి ఎలా ఒప్పుకున్నారు? వొప్పుకొని వీళ్ళు పెళ్లి చేసుకున్నా, కలిసి కాపురం చేయగలిగారా? ఇంతకీ కథ ఎటు మలుపులు తిరిగింది అన్న విషయం వెండి తెర మీద చూడాల్సిందే.

khushi-team1.jpg

విశ్లేషణ:

దర్శకుడు శివ నిర్వాణ కొత్త కథ ఏమీ తీసుకోలేదు, ఇలాంటి నేపథ్యంలో ఇంతకు ముందు ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే శివ ఈ కథని కొంచెం వైవిధ్యంగా నేరేట్ చేసాడు అంతే. ఒక నాస్తికుడు కొడుకు, ఒక హిందూ ప్రవచన కర్త కూతురు తండ్రులను కాదని వివాహం చేసుకొని ప్రపంచానికి తాము ఆదర్శ భార్యాభర్తలుగా జీవించి చూపెడతాము అని చెప్తారు. ఆలా వాళ్లిద్దరూ అనుకుంటారు, కానీ అది అంత సులువు కాదని వాళ్ళకి కూడా తెలుసు. ఎందుకంటే ఆ అమ్మయి ఎంతైనా ఒక బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చింది కాబట్టి ఆమెకుండే సెంటిమెంట్స్ ఆమెకుంటాయి, అలాగే ఈ అబ్బాయి నాస్తిక కుటుంబం నుండి వచ్చాడు కాబట్టి అవన్నీ ఏమీ లేవు అంటాడు. మరి ఈ ఇద్దరికీ ఎలా సరిపోయింది, వీళ్లిద్దరి మధ్య చిన్న చిన్న కలతలు, వివాదాలు, విభేదాలు, కానీ చివరికి ప్రేమ ఎలా గెలించింది, ఇది శివ నిర్వాణ చెప్పే కథ. #KhushiFilmReview

మొదటి సగం అంతా చాలా సరదాగా సాగిపోతుంది, దర్శకుడు శివ తొందరగానే కథలోకి వచ్చేస్తాడు. అలాగే కాశ్మీర్ అందాలను మురళి తన కెమెరాలో బందించి బాగా చూపించాడు. విజయ్ బేగం, బేగం అంటూ ఆమె వెనకాల తిరగడం, ఆమెకి తెలుగు తెలిసినా, హిందీలో మాట్లాడటం, విజయ్ వచ్చీ రాణి హిందీలో మాట్లాడటం, ఇవన్నీ నవ్వు తెప్పిస్తాయి. మధ్యలో పాటలు కూడా చాలా బాగుంటాయి, వీనుల విందుగా ఉంటాయి. వెన్నెల కిషోర్ మొదటి సగం, రెండో సగంలో రాహుల్ రామకృష్ణ విజయ్ పక్కన వుండి నవ్విస్తూ వుంటారు. అయితే రెండో సగంలో ఈ ఇద్దరు పెళ్లి చేసుకొని గొడవలు పడటం, మళ్ళీ కలవటం, ఇలా రెండో సగంలో కూడా శివ బాగానే చూపించాడు. అయితే ఆ హోమం క్లైమాక్స్ అంతగా ఎక్కలేదు అనిపిస్తూ ఉంటుంది. #KhushiReview క్లైమాక్స్ ఎందుకో బలంగా రాసుకోలేదు అనిపిస్తూ ఉంటుంది. అయితే సినిమాలో విజయ్, సమంతల జోడి అద్భుతంగా ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. అసలు వాళ్లిద్దరూ నిజమైన భార్యాభర్తలుగా తెర మీద కనిపించారు అంటే, వాళ్లిద్దరూ అంత చక్కగా చేశారు, దర్శకుడు కూడా వాళ్ళిద్దరి దగ్గర నుండి అంత నటన రాబట్టుకో గలిగాడు అని చెప్పాలి. మొత్తం మీద శివ ఈ సినిమాని చాలా క్లాస్ గా తీసాడు కానీ, క్లైమాక్స్ మాత్రం ఆ హోమం చుట్టూ తిరుగుతూ ఈ సినిమాకి అంతగా సూట్ కాలేదు అనిపిస్తుంది.

khushi-team.jpg

ఇక నటీనటుల విషయానికి వస్తే, విజయ్ దేవరకొండ మరోసారి తన నటనతో మెప్పించాడు. తెలుగులో చాలామంది హీరోస్ కదా, నటులు మాత్రం కొంతమందే వున్నారు, అందులో విజయ్ ఒకడు. విజయ్ నవ్విస్తాడు అలాగే భావోద్వేగాల్లో కూడా తను ఎంత బాగా చేయగలడో కూడా చూపించాడు. ప్రేమ కోసం పరితపించే భర్తగా కూడా చాలా బాగా చేసాడు. ఇలాంటి పాత్రలు విజయ్ కి బాగా సూట్ అవుతాయి కూడా. ఇక సమంతకి కూడా విజయ్ తో సమానంగా మంచి పాత్ర వచ్చింది, ఆమె కూడా పోటీపడి నటించింది అని చెప్పాలి. చాలా రోజుల తరువాత సమంత అన్ని భావాలు చూపించగల ఒక మంచి పాత్రలో తన నటనతో అబ్బురపరిచింది. ఆమెకి ఈ సినిమాలో చేసిన ఆరాధ్య పాత్ర కెరీర్ లో ఒక బెస్ట్ రోల్ అవుతుంది. ఇక మురళి శర్మ (MuraliSharma) తెలుగు ప్రవచన కర్తలా కనపడలేదు, నార్త్ ప్రవచన కర్తలా కనిపించాడు. సచిన్ ఖేడేకర్ (SachinKhedekar) కూడా రెగ్యులర్ రోల్. వాళ్ళిద్దరి పాత్రల్లో తెలుగువాళ్ళని తీసుకుంటే బాగుంటుంది. విజయ్ తల్లిగా శరణ్య (Saranya) బాగుంది, అలాగే సమంత స్నేహితురాలిగా శరణ్య ప్రదీప్ కూడా బాగుంది. వెన్నెల కిషోర్ (VennelaKishore), రాహుల్ రామకృష్ణ (RahulRamakrishna) నవ్విస్తారు. ఛాయాగ్రహణం చాలా బాగుంది. ఈ సినిమాకి విజయ్, సమంత లతో పాటు సంగీత దర్శకుడు అబ్దుల్ వాహాబ్ చాలా ముఖ్యం. ఎందుకంటే అతని సంగీతం ఈ సినిమాని ఇంకో లెవెల్ కి తీసుకెళ్లింది. పాటలు, నేపధ్య సంగీతం రెండూ ఈ సినిమాకి చాలా ఉపకరించాయి.

చివరగా, ‘ఖుషి’ సినిమా కథ ఏమీ కొత్తది కాదు, కాని దర్శకుడు శివ నిర్వాణ కొంచెం వైవిధ్యంగా చూపించాడు. విజయ్ దేవరకొండ, సమంత, సంగీతం ఈ సినిమాకి ముఖ్యమైనవి. సరదాగా సాగిపోయే సినిమా, మధ్య మధ్యలో కొన్ని సాగదీస్తున్నట్టు అనిపించినా, ఈ సినిమా అయితే ఒక్కసారి చూడొచ్చు.

Website | + posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here