చాలా సంవత్సరాల తరువాత అనుష్క శెట్టి తెర మీద ఈ ‘మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నవీన్ పోలిశెట్టి కథానాయకుడు, పి మహేష్ బాబు దర్శకుడు. మరి ఈ ఇద్దరి శెట్టిల మధ్య నడిచిన ప్రేమ కథ ఎలా వుందో తెలుసుకుందాం
సినిమా: మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి
నటీనటులు: అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి, జయసుధ, మురళీ శర్మ, తులసి, నాజర్, అభినవ్ గోమఠం, సోనియా దీప్తి తదితరులు
ఛాయాగ్రహణం: నిరవ్ షా
సంగీతం: రధన్
నేపథ్య సంగీతం: గోపి సుందర్
నిర్మాతలు: వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: పి మహేష్ బాబు
నవీన్ పొలిశెట్టి (NaveenPolishetty) ఇప్పుడిప్పుడే తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకుంటూ ఎదుగుతున్న నటుడు. ఇంతకు ముందు ‘జాతిరత్నాలు’ #JathiRatnalu, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ లాంటి హిట్ సినిమాలతో మంచి పేరు సంపాదించాడు. అలాగే అనుష్క శెట్టి (AnushkaShetty) చాలా సంవత్సరాల తరువాత ఒక సినిమా చెయ్యాలని అనుకొని, నవీన్ పోలిశెట్టి తో కలిసి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ #MissShetty MrPolishettyReview తో ప్రేక్షకుల ముందుకు ఈరోజు వచ్చారు. ఈ సినిమాకి పి మహేష్ బాబు (PMaheshBabu) దర్శకుడు, కాగా యూవీ క్రియేషన్స్ (UVCreations) నిర్మాణం చేశారు.
Miss Shetty Mr Polishetty story కథ:
అన్విత రవళి శెట్టి (అనుష్క) లండన్ లో మాస్టర్ చెఫ్, తల్లి (జయసుధ) తో ఉంటూ ఉంటుంది. తల్లితో పాటు ఇండియా వస్తుంది, అన్వితని పెళ్లి చేసుకోమని తల్లి పోరు పెడుతూ ఉంటుంది, ఎందుకంటే తనకి కూతురుగా నువ్వు చూసుకుంటావ్, నేను పోతే నీకు తోడు ఒకరు ఉండాలి అని. తల్లి దండ్రులు తన చిన్నప్పుడే కళ్ళముందు కొట్టుకోవటం, విడిపోవటం చూసిన అన్వితకి పెళ్లి అన్నా, బంధాలు, రిలేషన్ షిప్ అన్నా పడదు. ఈలోపు తల్లి మరణిస్తుంది, అన్విత ఒంటరి అయిపోతుంది. ఒంటరితనం భరించలేక తోడు కావాలని అనుకుంటుంది, ఒక బిడ్డకి తల్లి అవ్వాలని అనుకుంటుంది. తల్లి అవటానికి ప్రెగ్నంట్ అయితే చాలు, పెళ్ళెందుకు అని అన్విత అలోచించి న్యాయపరమైన విధానంలో, వీర్య దానం చేసే అబ్బాయికోసం వెతుకుతుంది. #MissShetty MrPolishettyReview ఆలా వెతుకున్న సమయంలో సిద్ధూ పోలిశెట్టి (నవీన్ పోలిశెట్టి) ని కలుస్తుంది, అతను ఒక స్టాండప్ కమెడియన్. అతనిలో అన్ని సుగుణాలు ఉన్నాయో లేదో అని అతనితో ఒక మూడు నెలలు తిరుగుతుంది, కానీ సిద్ధూ ఆ కాస్త పరిచయంతో అన్వితతో ప్రేమలో పడతాడు. ఓ రోజు పెళ్లి ప్రపోజ్ కూడా చేస్తాడు. కానీ అన్విత తాను కేవలం తల్లి కావాలనే అనుకుంటోంది అని, పెళ్లికి మాత్రం నో అని చెప్తుంది. #MissShetty MrPolishettyReview ఆ సమాధానం విని సిద్ధూ షాకవుతాడు, పెళ్లి కాకుండా ఆలా పిల్లల్ని కనాలని అనుకోవడం సమాజానికి విరుద్ధమని తన అభిప్రాయం చెపుతాడు. ఇంకేముంది ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. అన్విత అప్పుడు ఏమి చేసింది, వేరే డోనార్ ని వెతుక్కుందా? ఇండియా వదిలి లండన్ ఎందుకు వెళ్ళిపోయింది? చివరికి ఇద్దరూ కలిసారా? ఇంతకీ అనుకున్నది సాధించి అన్విత బిడ్డకు జన్మనిచ్చిందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
దర్శకుడు మహేష్ బాబు ఒక సున్నితమైన పాయింట్ ని తీసుకొని దాని చుట్టూ సరదాగా ఒక కథని అల్లేదు. ఇంతకు ముందు ఈ వీర్యదానం మీద సినిమాలు వచ్చాయి కానీ అవి అంతగా నడవలేదు, ఎందుకంటే ఆ సినిమా కథలు వాటిచుట్టూ తిరిగి అవి కొంచెం చూడటానికి ఎబ్బెట్టుగా ఉండటమే కారణం. అయితే ఇక్కడ మహేష్ తన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ #MissShetty MrPolishettyReview సినిమాలో వీర్యదానం కథనే తీసుకున్నాడు కానీ, కథని సరదాగా చూపించటమే కాకుండా ఎక్కడా హద్దులు దాటి పోలేదు. ఒక అమ్మాయి తన తల్లిదండ్రులు విడిపోవటం చూసి ప్రేమ, పెళ్లి అంటే పడదు. ఇంకో పక్క అబ్బాయికి ప్రేమ, పెళ్లి, బంధాలు వీటి మీద చాలా నమ్మకం. ఇటువంటి ఇద్దరి వ్యక్తుల మధ్య నడిచే కథే ఈ సినిమా.
ఈ సినిమా పూర్తి క్రెడిట్ దర్శకుడు మహేష్ బాబుకి చెందుతుంది. ఎందుకంటే సినిమాలో నవ్వులు ఉంటాయి, సరదా సన్నివేశాలు ఉంటాయి, అలాగే భావోద్వేగాలు కూడా ఉంటాయి. అదేదో వీర్యదానం అనగానే కొంతమంది ఇది కూడా అలాంటి సినిమానే అని అనుకుంటారేమో, ఇది అలా కాదు, వేరేలా తీసి చూపించాడు దర్శకుడు. కథ చాలా చిన్నది, కానీ దర్శకుడు దానికనుగుణంగా రాసుకున్న సన్నివేశాలు భలే నవ్వులు తెప్పిస్తాయి. మొదట్లో ఒక 20 నిముషాలు కథ అనుష్క పాత్ర చుట్టూ తిరుగుతుంది, తల్లితో ఆమె బంధం, తరువాత ఒంటరి అవటం, అవన్నీ మెల్లగా సాగుతూ ఉంటాయి కానీ పరవాలేదు అన్నట్టుగా చూపించాడు. #MissShetty MrPolishettyReview ఎప్పుడయితే నవీన్ పోలిశెట్టి అడుగు పెడతాడో అక్కడ నుండి కథ పరిగెడుతూ వినోదాత్మకంగా ఉంటుంది. సిద్ధూని ఇంటర్వ్యూ చేసేటప్పుడు, అతను ఎలాటి వాడో తెలుసుకోవాలని అనుకోవటం ఇదంతా సరదాగా సాగిపోతుంది. అలాగే సిద్ధుని డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లినప్పుడు, సిద్ధూ ఇంట్లో తనకన్నా పెద్దమ్మాయిని చేసుకోవాలని చెప్పటానికి పడే తాపత్రయం ఇవన్నీ హాస్యంగా బాగా పండాయి. సరదాగా సాగుతున్న రెండో సగంలో కొంచెం సీరియస్ గా నడుస్తూ భావోద్వేగాలను కూడా బాగా చూపించాడు. తను అన్వితని ఎంత ప్రేమిస్తున్నాడో మధనపడుతున్న సిద్ధూ, క్లైమాక్స్ లో సన్నివేశం ఇవన్నీ ఆకట్టుకుంటాయి.
ఇక నటీనటుల విషయానికి వస్తే నవీన్ పోలిశెట్టి సినిమా బరువుని తన బుజం మీదే వేసుకొని మోశాడు అన్నట్టుగా ఉంటుంది. అతని నటన, హాస్యం, భావోద్వేగం అన్నీ సమపాళ్లలో పండించాడు. స్టాండప్ కమెడియన్ గా అతను ఆ పాత్రలో ఒదిగిపోయాడు. అతను తనదైన రీతిలో చెప్పిన డైలాగులు కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాయి. అతను స్క్రీన్ మీద కనిపిస్తే చాలు నవ్వులే నవ్వులు. అలాగే క్లైమాక్స్ లో కూడా బాగా చేసాడు. ఇక అనుష్క శెట్టి సుమారు అయిదు సంవత్సరాల తరువాత తెర మీద కనిపించింది, హుందాగా నటించింది, అలాగే మెప్పించింది కూడా. ఆమె పాత్రని బాగా రాసుకున్నాడు దర్శకుడు. ఇక మురళి శర్మ (MuraliSharma), తులసి, నాజర్ (Nassar) తమ పాత్రల పరిధి మేరకు చేశారు. అనుష్క స్నేహితురాలుగా సోనియా బాగుంది. జయసుధ (Jayasudha) తల్లి పాత్రలో తళుక్కున మెరుస్తుంది. అభినవ్ గోమాటం (AbhinavGomatam) పరవాలేదు. సంగీతం ఒకే, నేపధ్య సంగీతం ఆకట్టుకుంది. మాటల్లో పంచులు వున్నాయి. నీరవ్ షా ఛాయాగ్రహణం సినిమాకి ప్రత్యేక ఆకర్షణ.
చివరగా, ‘మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి’ #MissShetty MrPolishettyReview సినిమా దర్శకుడు మహేష్ బాబు వీర్య దానం అనే నేపథ్యంలో కథ రాసుకున్నా, తెరమీద మాత్రం హద్దులు దాటకుండా, వినోదాత్మకంగా చూపించి సఫలీకృతుడు అయ్యాడు. అతనికి నూటికి నూరు మార్కులు వేస్తె, అతని రాసుకున్న పాత్రలకి సరైన న్యాయం చేశారు నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి. ఈ సినిమా అందరూ చూసి ఆనందించవచ్చు. (Miss Shetty Mr Polishetty film review)