తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈనెల 17న కేంద్రం అధికారికంగా నిర్వహించబోతుంటే బీఆర్‌ఎస్‌, కాంగ్రె్‌సలు మజ్లి్‌సతో కుమ్మక్కై ఆ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు కిషన్‌రెడ్డి ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పాల్గొంటున్న ఈ ఉత్సవాలను దెబ్బతీసేందుకు అదే రోజున బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు సభలు ఏర్పాటు చేసుకున్నాయన్నారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మాట్లాడతూ.. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడంపైనా సీఎం కేసీఆర్‌, రాష్ట్ర ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఈసారి రాష్ట్రపతి భవన్‌లోనూ తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి కూడా పాల్గొంటారని ఆయన చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం.. అధికార పార్టీ నాయకులకు, తమకు నచ్చినోళ్లకే బీసీ బంధు ఇస్తూ అప్రజాస్వామికంగా వ్యవహారిస్తోందని ఆరోపించారు. బీసీ కులవృత్తిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం ఇస్తామంటూ ప్రకటించిన బీఆర్‌ఎస్‌ సర్కార్‌.. నిబంధనలకు తూట్లు పొడుస్తోందని మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన 93 కులాల్లో కేవలం 14 కులాలకు మాత్రమే బీసీ బంధు ఇస్తున్నారని, మిగతా కులాల వారికి ఎందుకివ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. కాగా, రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాలకు బీజేపీ ఇన్‌చార్జీలను నియమించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆ జాబితాను విడుదల చేశారు.

 

బీజేపీ టికెట్‌ కోసం భారీగా ఆశావహులు

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌ కోసం పెద్దసంఖ్యలో ఆశావహులు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తరలివచ్చారు. దీంతో రద్దీని తగ్గించేందుకు దరఖాస్తుల స్వీకరణ కమిటీ ఆశావహులకు టోకెన్‌లు ఇచ్చింది. ఒకదశలో కౌంటర్‌ కొద్దిసేపు మూసివేశారు. దుబ్బాక టికెట్‌ మరోసారి తనకు కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యే ఎం. రఘునందన్‌రావు దరఖాస్తు అందజేశారు. జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ బండ కార్తీకరెడ్డి సికింద్రాబాద్‌ టికెట్‌ ట్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. గజ్వేల్‌ టికెట్‌ను పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌కు ఇవ్వాలని పలువురు నాయకులు వినతిపత్రం అందజేశారు. పార్టీ అధికార ప్రతినిధులు విఠల్‌(సంగారెడ్డి,) సంగప్ప (నారాయణఖేడ్‌), సుధాకర్‌శర్మ(మహేశ్వరం), మిథున్‌రెడ్డి(షాద్‌నగర్‌), ఆకుల విజయ(సనత్‌నగర్‌), గోపి(నర్సాపూర్‌), గూడూరు నారాయణరెడ్డి(భువనగిరి), సతీ్‌షకుమార్‌(పాలకుర్తి) తదితరులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా, తమకు 36 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ టికెట్లు ఇవ్వాలని మున్నూరుకాపు సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు వారు కిషన్‌రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాశ్‌ జావడేకర్‌కు వినతిపత్రం ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *