నిజామాబాద్ A9 న్యూస్:
నందిపేట్ మండల భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద తెలంగాణ రైతాంగ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి, రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించి ఆమె పోరాట చరిత్రను కీర్తించడం జరిగింది.
తెలంగాణ రైతాంగ పోరాటానికి వెన్నెముకగా నిలిచి, రైతులను రైతు కూలీలను మహిళలను ఏకం చేసి భూమి నాది కష్టం నాది పండించిన పంట నాది, దున్నేవాడిదే భూమి, కష్టపడి పండించిన వాడిదే పంట అని జమీందారీ పెత్తందారి పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అని,ఈ భూమినాది… పండించిన పంటనాది… తీసుకెళ్లడానికి దొరెవ్వడు… నా ప్రాణం పోయాకే ఈ పంట, భూమి మీరు దక్కించుకోగలరు.. అంటూ మాటల్ని తూటాలుగా మల్చుకొని దొరల గుండెల్లో బడబాగ్నిలా రగిలిన తెలంగాణ రెైతాంగ విప్లవాగ్ని చాకలి అయిలమ్మ అని నందిపేట మండల భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్ గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ హుస్సేన్, ఎంపీటీసీ బజరంగ్ చవాన్, నందిపేట్ మండల రజక సంఘం నాయకులు ఎండ్రాలగంగాధర్, మాజీ ఎంపీటీసీ హైమద్ ఖాన్,చాకలి దేవన్న, సాకలి సాయిలు, పెద్ద సాగర్, చాకలి నరసయ్య, వార్డు మెంబర్లు గంధం సాయిలు, క్లబ్ గంగాధర్, సలీం, తల్వేద రాజేందర్, బీఆర్ఎస్ యువ నాయకులు దర్వాడి అశోక్, గంధం రాజశేఖర్, విజయనగరం నరేష్, రైతుఫారం తిలక్, తానాజీ మహేష్ దీపక్ రాజు ఉదయ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.