నిజామాబాద్ A9 న్యూస్:
భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షుడు ద్యాగ ఉదయ్ ఆధ్వర్యంలో రెండు రోజుల క్రితం సనాతన హిందు ధర్మాన్ని అవహేళన చేస్తూ మాట్లాడిన ఉదయనిది స్టాలిన్ దిష్టిబొమ్మను శుక్రవారం ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద దగ్ధం చేశారు.
సనాతన హిందూ ధర్మంపై ఉదయనిది స్టాలిన్ అవహేళనగా మాట్లాడటం పట్ల బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసి ఆయన వ్యాఖ్యలను తప్పుబట్టారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఉప్పల శివరాజ్ కుమార్, బీజేపీ నాయకులు ఆర్మూర్ నియోజకవర్గ కన్వీనర్ పాలెపు రాజు, నాయకులు దుగ్గి విజయ్, మందుల బాలు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు, వివిధ మోర్చాల అధ్యక్ష,కార్యదర్శులు పాల్గొన్నారు.