నిజామాబాద్ A9 న్యూస్ :
ఆర్మూర్ పట్టణంలోని ప్రతి శుక్రవారం ఫ్రైడే -డ్రై డే కార్యక్రమము. మన ఇంటి పరిసరాల శుభ్రత కోసం- మన ఆరోగ్యం కోసం వారములో ఒక రోజు పురపాలక శాఖా మత్యులు కేటీఆర్, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు ల పిలుపు మేరకు మన ఎమ్మెల్యే జీవన్ రెడీ, నియోజకవర్గ ఇంచార్జ్ రాజేశ్వర్ రెడ్డి ల ఆదేశానుసారం
శుక్రవారం ఆర్మూర్ పట్టణములోని రెండవ వార్డులో మున్సిపల్ కౌన్సిలర్ సంగీతా ఖాందేష్, వడ్డెర కాలనీ, రంగాచారి నగర్ కాలనీలలో వైద్య అధికారులు, మున్సిపల్ అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తూ, ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, నిలువ వున్న నీరు ద్వారా దోమలు ఏవిదంగా పెరుగుతాయో తెలిపి, పలు చోట్ల నిలువ వున్న వృధానీటిని పారవేయడం జరిగింది. మన ఇంటి పరిసరాలలో వృధా నీరు నిలువ వుంచవద్దని కోరారు. ఈ కార్యక్రమములో బిఆర్ఎస్ నాయకులు ఖాందేష్ సత్యం, మున్సిపల్ సానిటరీ అధికారి మహేష్, ఆరోగ్య శాఖా హెల్త్ అసిస్టెంట్లు అనురాధ, సౌందర్య, భాగ్య, ఆనంద్, స్వప్న, స్రవంతి మున్సిపల్ సిబ్బంది శంకర్, మమత, మహిళా సమాఖ్య సభ్యులు గోదావరి, రాజవ్వ తదితరులు పాల్గొన్నారు.