నిజామాబాద్ A9 న్యూస్:
ఆర్మూర్ నియోజకవర్గం ఆలూర్ మండల కేంద్రంలోనీ నరేష్ అనే వ్యక్తి ఒక షాపులో దొంగతనం చేస్తూ గురువారం సాయంత్రం రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన విషయం ఆలస్యంగా తెలిసింది. దొంగతనం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని దొంగను ఆలూర్ మండల ప్రజలు గాంధీ చౌరస్తా వద్ద తాళ్లతో కట్టి ఉంచారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.
అయితే చిల్లర దొంగ కాబట్టి తాము తీసుకెళ్లలేమని పోలీసులు చేతులెత్తేయడంతో ఆలూరు మండల కేంద్రానికి చెందిన యువకులు అవాక్కయ్యారు. తమ ఇండ్లలో సైతం దొంగతనాలు చేసిన చిల్లర దొంగ నరేష్ ను పలువురు యువకులు పట్టుకొని ఏ ఏ వస్తువులు దొంగతనం చేశావని దొంగను నిలదీసి అడిగారు.
అయినా దొంగ చెప్పకపోవడంతో ఆగ్రహంతో యువకులు ఆ దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని కొట్టారు. అయినా నరేష్ ఏమీ చెప్పకపోవడంతో ఆలూరు మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద స్తంభానికి తాళ్లతో దొంగను కట్టి ఉంచారు. దొంగను పట్టుకున్న విషయాన్ని కొందరు యువకులు పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది.
ఈ దొంగను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విచారణ చేసి తిరిగి చోరీలు చేయకుండా చూస్తారని మండల కేంద్ర ప్రజలు భావించారు. అయితే పోలీసులు మాత్రం చిల్లర దొంగను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళలేమని చెప్పడంతో ఆలూరు మండల కేంద్ర వాసులు ఆశ్చర్యపోతున్నారు శుక్రవారం తెలిసింది.