నిజామాబాద్ A9 న్యూస్:
తెలంగాణ రాష్ట్ర పూసల సంఘం పిలుపు మేరకు మన జిల్లా అధ్యక్షుడు సుంకరి రంగన్న ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న మన కులస్తులు పెద్ద మనుషులు పెద్దలు అందరూ కలిసి కలిసికట్టుగా ఎంతో ఉత్సాహంగా ఉత్తేజపరుస్తూ మన జిల్లా అధ్యక్షుడు సుంకర రంగన్న ఆధ్వర్యంలో మన పూసల కులాన్ని ఎం బి సి, డి ఎన్ టి, లో కలపాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కి వినతి పత్రం అందజేయడం జరిగింది మరియు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ని కూడా కలిసి వినతి పత్రం అందజేయడానికి సమిష్టిగా కలిసి అందరం ముందుకు వెళ్లడం జరిగింది. జిల్లా అధ్యక్షులు సుంకరి రంగన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తో 2500 గజాల స్థలం మరియు 50లక్షలు గురించి పదేపదే అడగడం జరిగింది. పూసల కులస్థులు పడుతున్న బాధలను వినతి పత్రం రూపం లో ఎం ఎల్ ఏ కి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో జిల్లా లోని వివిధ మండలాల అధ్యక్షులు, పూసల కులస్థులు,యువత పాల్గొని కార్యక్రమాన్ని విజయ వంతం చేశారు.