నిజామాబాద్ A9 న్యూస్:
నిజమాబాద్ నగర తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్ అండ్ బి వసతి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నగర అధ్యక్షుడు అఖిల్ మాట్లాడుతూ ఈ మధ్యన విద్యార్థినిలపైన అమ్మాయిలపైన వేధింపులు ఎక్కువ అయ్యాయని అనేకమంది అమ్మాయిలు వేధింపులు తాళలేక ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారని అన్నారు. నిన్న గోల హనుమాన్ వద్ద క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని స్నేహ తివారి బలవర్మానం ఇలాంటి వేధింపుల వల్లే జరిగిందని అన్నారు.
క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల వద్ద కొంతకాలం క్రితం విద్యార్థినులను ప్రేమ వేధిస్తున్న యువకులను అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఘటడి విశాల్ అనే యువకుడిని దాదాపు నిందితుడు సోఫియాన్ 30 నుండి 60 మంది యువకులుతో దాడి చేసి తీవ్రంగా గాయాలపాలు చేశారు ఆ ఘటనలో స్నేహతివారి వారికి కూడా ఒక బాధితురాలే, ఈ సంఘటనపై విద్యార్థి సంఘాలు, విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులు, అప్పటి బాధితుడు గటాడి విశాల్ తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ పోలీసులు అనేక రాజకీయ ఒత్తిళ్లకు లోబడి సరైనటువంటి విచారణ చేపట్టకుండా కేసును గాలికి వదిలేశారు దాని పర్యవసానమే ఈరోజు సోఫియాన్ వేధింపులు తాళలేక స్నేహ తివారి బలవర్మనం అని అన్నారు.
కాబట్టి పట్టణాలకు దూరంగా ఉన్నటువంటి ఇంజనీరింగ్ నర్సింగ్ కళాశాలల వద్ద సరైనటువంటి భద్రత కల్పించాలని నిత్యం షీ టీమ్లనేగా ఉండాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తా ఉంది. ఇటువంటి పోకిరిలను కఠినంగా శిక్షించి బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో మహేష్, సుజిత్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.