నిజామాబాద్ A9 న్యూస్:
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మొదలై సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ యాత్రకు మద్దతుగా ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిబాబా గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు గురువారం భారత్ జోడో యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు పీసీసీ ప్రచార కమిటీ సభ్యులు కోలా వెంకటేష్, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ మార చంద్రమోహన్ మాట్లాడుతూ దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ విభజన రాజకీయల వల్ల దేశంలోని ప్రజల మధ్య విభజన ఏర్పడింది అని, మతాల, ప్రాంతాల, కులాల, ఆహారపు అలవాట్లను అడ్డంపెట్టుకొని ప్రజల మధ్య దూరం పెంచారని అన్నారు. వీటన్నిటిని తొలగించేందుకు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 130 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర భారత్ జోడో యాత్ర పేరు మీద రాహుల్ గాంధీ పాదయాత్ర చేశాడని తెలిపారు. ఈ యాత్రకు దేశంలోని అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలిపి అక్కున చేర్చుకున్నారని అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్నారు.
గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు రెండో విడత భారత్ జోడో యాత్ర ఉంటుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు విట్టం జీవన్, చిన్నా రెడ్డి, మీర్ మాజీద్, దేగాం ప్రమోద్, జిమ్మి రవి, మందుల పోశెట్టి, బట్టు శంకర్, హబీబ్, రమణ, బాల కిషన్, మెహబూబ్, శ్రీకాంత్, పాషా, ఉస్మాన్, పెద్ద పోశెట్టి, అలీమ్, అభినవ్, దినేష్, కిషోర్, భగత్, యువజన కాంగ్రెస్ నాయకులు భావేష్, విజయ్, అఫ్రోజ్, సల్మాన్, వాసి, సోహైల్, అబ్బు, గౌస్, సాయి, ఎన్ ఎస్ యూ ఐ నాయకులు అఖిల్, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.