నిజామాబాద్ A9 న్యూస్:
ఆర్మూర్ పట్టణంలోని మల్లారెడ్డి చెరువును మినీ ట్యాంక్ బాండ్ గా అభివృద్ధి చేస్తున్న సందర్భంగా గురువారం మల్లారెడ్డి చెరువు కట్ట వద్ద జరుగుతున్న మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనులను ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పర్యవేక్షించారు. ఆర్మూర్ పట్టణంలో మినీ ట్యాంక్ బండ్ లుగా అభివృద్ధి చేస్తున్న మల్లారెడ్డి, పెరికిట్ ఊర చెరువులను సర్వాంగ సుందరంగా ప్రజలు సేదతీరేలా తీర్చిదిద్దాలని, ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులను పకడ్బందీగా చేయించాలని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహన్, మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ లకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సూచించారు.
ట్యాంక్ బండ్ నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యానికి తావు లేకుండా కచ్చితత్వంగా పనులు చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్, వైస్ చైర్మన్ షేక్ మున్నా, మాజీ వైస్ చైర్మన్ మోత్కూరి లింగాగౌడ్, ఆర పట్టణ బీఆర్ ఎస్ అధ్యక్షుడు పూజ నరేందర్, సీనియర్ నాయకులు కాందేష్ శ్రీనివాస్, పూల సుధాకర్, జనార్దన్ గౌడ్, కొడిగెల మల్లయ్య, చేపూర్ షాహిద్ పాల్గొన్నారు.