తన ఇంటి ముందు ప్రతిరోజు మలవిసర్జన చేస్తున్నాడని ఓ మహిళ చేసిన ఆరోపణలకు ఓ ఒంటిపై పెట్రోల్ పోసుకొని యువకుడు మృతి మహిళపై కేసు నమోదు

ఓ మహిళ చేసిన అవమానభారంతో యువకుడు ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఘటన మాక్లుర్ మండలంలోని అమ్రాద్ గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబీకుల కథనం ప్రకారం అమ్రాద్ గ్రామానికి చెందిన మేతరి ప్రమోద్ వయసు 18 సంవత్సరాలు తాను ఈనెల 4వ తేదీన తన ఇంటికి కొద్ది దూరంలో మూత్ర విసర్జన చేశాడు.సమీపంలోని నివసించే మరో ఇంటి యజమాని ఓ మహిళ సెల్ఫోన్లో చిత్రీకరించింది ఇలా రోజు నన్ను చూస్తూ మూత్ర విస్తరణ మూత్ర విసర్జన చేస్తున్నాడని తన భర్తకు చూపించింది తన భర్త కుల సంఘ పెద్దలతో పంచాయతీ పెట్టించాడు తాను ఉద్దేశపూర్వకంగా చేయలేదని వర్షం పడటంతో అలా చేయాల్సి వచ్చిందని ప్రమోద్ చెప్పిన వినకుండా తీవ్రంగా మందలించారు. మనస్థాపానికి గురైన ప్రమోద్ అదే రోజు తన కుటుంబ సభ్యులతో ఆర్మూర్ వెళ్తానని చెప్పి ఆర్మూర్ శివారు అటవీ ప్రాంతంలో తన ఒంటిపై కిరోసిన్ పోసుకొని స్నేహితులకు ఫోన్ చేసి చనిపోతున్నట్లు చెప్పి నిప్పంటించుకున్నాడు. ప్రమోద్ స్నేహితులు ఈ విషయాన్ని తన కుటుంబీకులకు తెల్పడంతో సంఘటన స్థలానికి వెళ్లేసరికి ప్రమెద్ తీవ్రంగా గాయపడి ఉన్నాడు. వెంటనే ఆంబులెన్స్ లో ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లారిజమున మృతి చెందాడు. ప్రమోద్ తల్లిదండ్రులకు ముగ్గురు సంతానం కాగా ప్రమోద్ చివరివాడు తల్లి చిన్నప్పుడే మృతి చెందని నానే పెంచుతూ ప్రమోదుని ఇంటర్ పూర్తి చేసి ప్లంబర్ గా పని చేస్తున్నాడు ఈ విషయంపై ఆర్మూర్ సిఐ కి వివరాలు కోరగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *