నిజామాబాద్ A9 న్యూస్:
ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వర్షాకాలం సందర్భంగా నియోజకవర్గంలో గ్రామ గ్రామాన గొడుగుల ను పంపిణీ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా నందిపేట్ మండలం గాదేపల్లి గ్రామంలో సర్పంచ్ నక్కల భూమేష్, బి.ఆర్.ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గడ్డం చిన్నారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు గొడుగులను పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓట్ల కోసం ప్రతిపక్ష పార్టీలు తప్పుడు వాగ్దానాలతో ప్రజలను ప్రలోభ పెట్టి ప్రయత్నాలు చేస్తున్నారని గతంలో వారి పరిపాలనలో చేయలేని కార్యక్రమాలను నేడు కే.సీ.ఆర్ నేతృత్వంలో ఆర్మూర్ నియోజక వర్గం ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం అభివృద్ధి చేయబడిందని ప్రజల కోసం అహర్నిశలు కష్టపడే మన ఎమ్మెల్యేని మళ్లీ మూడవసారి గెలిపించుకొని మంత్రిగా చూడాలని ,
ఈ స్థానిక ఎన్నికలలో కూడా మేమంతా జీవన్ రెడ్డి తోనే అని గ్రామ ప్రజలు ,కార్యకర్తలు తెలియజేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో గాదేపల్లి బూత్ స్థాయి కమిటీ సభ్యులు బి.ఆర్.ఎస్ కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.