Tuesday, November 26, 2024

ప్రజల డబ్బులను వృధా చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

నిజామాబాద్ A9 న్యూస్:

                   

*రెండుసార్లు అధికారంలో ఉన్న వంతెన పనులు పూర్తి చేయని ప్రభుత్వం

*కోట్ల రూపాయల అప్పు చేసిన అభివృద్ధి లేని తెలంగాణ ప్రభుత్వం

*రోడ్డుపై దోసలు వేసినట్టుగా బీటీ రోడ్డు పనులు

*తెలంగాణ ప్రజల డబ్బులను వృధా చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం

ఇందల్వాయి మండలంలోని ఇందల్వాయి ఆర్టీసీ బస్టాండ్ నుండి ధర్పల్లి వెళ్లే వెంగల్ పాడ్ తాండ కల్వర్టు మరమ్మతు పనులు పూర్తి చేయకపోవడంతో మూడు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాలకు నాణ్యతలేని బీటీ రోడ్డును పరిశీలించిన బిజెపి నాయకుడు ఎమ్మెల్యే అభ్యర్థి దినేష్ కులచారి, గద్దె భూమన్న రోడ్డు మరమ్మత్తులు గురించి పరిశీలన చేసి అధికారులు అడిగి తెలుసుకున్నారు.

అధికారంలో ఉన్న పార్టీ తొమ్మిదిన్నర సంవత్సరాలు పూర్తిచేసిన కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టు అధికార పార్టీ పనులు టెండర్లు వేసే కాంట్రాక్టర్లకు లాభాల కోసమే కానీ నాణ్యత కోసం కాదని ప్రయాణికులకు ప్రాణాలు పణంగా పెట్టుకుని ఈ వంతెనల పై ప్రయాణిస్తుంటే భయంతో వారు వెళుతున్నారు ఎన్నిసార్లు ప్రశ్నించిన ప్రశ్నించే గొంతు బిజెపి అని గుర్తుంచుకోవాలని రూరల్ లో ఎక్కడ కూడా నాణ్యమైన పనులు బిటి రోడ్లు కావచ్చు గ్రామాల్లో సిసి డ్రైనేజీలు, సిసి రోడ్లు, స్కూల్ భవనాలు, ఏది చూసినా లోపాలకు మారుపేరు మన రాష్ట్ర ప్రభుత్వమని ప్రజలు గమనిస్తున్నారని త్వరలో మీరు చేసిన అభివృద్ధి ఎలాగా ఉందో ప్రజలు భారతీయ జనతా పార్టీకి అధికారాన్ని ఇస్తారని ఆయన.

ఈ సందర్భంలో తెలిపారు సోమవారం రాత్రి ఈ వంతెన వద్ద జరిగిన యాక్సిడెంట్ ఒక కుటుంబం లో భార్యాభర్తలిద్దరూ కారు గుంతల్లో టైరు పగిలి చెట్టును ఢీకొని కారులోని ఎయిర్ బ్యాగ్ పగిలి వారికి పెద్ద ప్రమాదమే తప్పిందని తెలిసిన వెంటనే వచ్చి ఆయన ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకుని ఆయన ఈ పనులను చేయించారు ఇలాంటి ప్రమాదాలు మరెన్నో జరిగాయని అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కి చెందిన ఏ నాయకులు కూడా వచ్చి చూడలేదు బీఆర్ఎస్ పార్టీకి చేతగాని పనులను.

బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి దినేష్ కులాచారి ఆయన సొంత డబ్బులతో ఈ గుంతలను పూడ్చి బాగు చేయించడం విశేషం. ఈ కార్యక్రమంలో పద్మా రెడ్డి, బిజెపి మండల అధ్యక్షులు రాజన్న, నారాయణ, శ్రావణ్, విష్ణు, సంతోష్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here