నిజామాబాద్ A9 న్యూస్:
భారత రాష్ట్ర సమితి పార్టీ నందిపేట్ మండల అధ్యక్షులు మచ్చర్ల సాగర్ ఉమ్మడి, నందిపేట్ మండలంలోని అన్ని గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు, అన్ని గ్రామాలలోని ప్రతి బూతు స్థాయి ఇన్చార్జిలు, ప్రతి గడప గడపకు వెళ్లి బీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ,
ఎమ్మెల్యే జీవన్ ఆధ్వర్యంలో ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే ని 60 వేల మెజార్టీతో గెలిపించేందుకు గడప గడపకు వెళ్లి ప్రచారం చేయాలని కోరడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని సాగర్ అన్నారు.