తెలంగాణ A9 న్యూస్:

తెలంగాణ పద్మశాలీల బతుకులు బాగు పడాలంటే రాజ్యాధికారం తప్పనిసరి అని పద్మశాలీలు స్పష్టం చేశారు. హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో పద్మశాలీ రాజకీయ శంఖారావం సభ నిర్వహించారు. తెలంగాణలో 8% జనాభా కల్గిన పద్మశాలీలకు అన్ని పార్టీలు 6 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లు ఇవ్వాలని తీర్మానించారు. పార్టీలు అండగా ఉండకపోతే పద్మశాలీలంతా నోటాకు ఓటు వేయాలని నిర్ణయించారు. చేనేత జౌళి శాఖను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *