నిజామాబాద్ A9 న్యూస్:
నిజామాబాద్ నగర తెలంగాణ విద్యార్థి పరిషత్ అధ్యక్షుడు అఖిల్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్ లోని గల విస్డం హై స్కూల్ ప్రతి రెండు శనివారం, ఆదివారం పిల్లలకు స్కూల్ నిర్వహించడం జరుగుతుంది. దానిపై తెలంగాణ విద్యార్థి పరిషత్ మండిపడి ఇంతకీ ముందు కూడా తర్గతులు నిర్వహిస్తూ నప్పుడు కంప్లైంట్ చేయడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వా నిబంధనలు ఉల్లంఘించి పాఠశాలలను నడుపుతున్నటువంటి విస్డం హై స్కూల్ గుర్తింపును రద్దుచేయాలని ఎంఈఓ రామారావు, డీఈవో దుర్గ ప్రసాద్ లకి తెలియజేయడం జరిగింది. వెంటనే స్కూల్ లో ఉన్న పిల్లలని ఇంటికి పంపించి స్కూల్ ని బంద్ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎం ఈ ఓ అధికారులు, తెలంగాణ విద్యార్థి పరిషత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.