నిజామాబాద్ A9 న్యూస్:
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి మొదటిసారిగా ఆర్మూర్ కు వచ్చిన సందర్భంగా డాక్టర్ మధు శేఖర్ కు ఆర్మూర్ ప్రాంత ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆర్మూర్ డివిజన్ పరిధిలోని పలు కుల సంఘాల సభ్యులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, వారికి శాలువా పూలదండలతో ఘనంగా సత్కరించారు.
అనంతరం వారు మాట్లాడుతూ నేను పుట్టింది మధుశేఖర్ గా భీంగల్ లో అయితే ఎం.జే. డాక్టర్ మధుశేఖర్ గా ఆర్మూర్ లో 32 సంవత్సరాలుగా స్థిరపడ్డాను అన్నారు. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ జిల్లా మొత్తం అన్ని ప్రాంతాల్లో నన్ను ఎం.జే. డాక్టర్ మధు శేఖర్ గానే గుర్తించారు. ఆర్మూర్ ప్రాంత ప్రజలు కుల మతాలకు అతీతంగా నన్ను ఆదరించారు. వారిలో ఒకడిగా నన్ను ఆత్మీయంగా చూసుకున్నారు. దాని ఫలితమే నేడు నాకు ఒక ఉన్నతమైన పదవిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నా సేవలను గుర్తించి పార్టీ అధినాయకుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నన్ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్ గా నియమించినందుకు కృతజ్ఞతలు అన్నారు.
రాష్ట్ర హెల్త్ మినిస్టర్ అయినటువంటి హరీష్ రావు ఆధ్వర్యంలో నన్ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్ గా నియమించినందుకు హెల్త్ మినిస్టర్ కు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు, రోడ్ల భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కి ఆర్మూర్ ఎమ్మెల్యే, పియుసి చైర్మన్, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి జీవన్ రెడ్డికి, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ర్యాలీగా అక్కడనుండి భీమ్గుల్ కు బయలుదేరారు.
ఈ కార్యక్రమంలో ఆయన వెంట మునిపల్లి అనంతరెడ్డి, చేయూత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు మానస గణేష్, కలిగోట గంగాధర్, చేత స్వచ్చంద సంస్థ సభ్యులు. డాక్టర్లు, పలు కుల సంఘాల నాయకులు. సభ్యులు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.