నిజామాబాద్ A9 న్యూస్:
ఇందల్వాయి మండల జెడ్పి హెచ్ఎస్ హైస్కూల్ లో ఎస్ ఎస్ సి సెంటర్ ను మంజూరు చేయాలని నిజామాబాద్ విద్య శాఖ అధికారితో ఇందల్వాయి గ్రామములోనీ సెంటర్ లేనందువలన ఇప్పుడు కావలసిన సదుపాయాలన్నీ సమకూర్చారు ఇందల్వాయి మండలంలో విద్యార్థులకు తిర్మాన్ పల్లీ హై స్కూల్ ఎస్టి గురుకుల విద్యార్థులకు కేజీవిపి స్కూల్ విద్యార్థులకు దాన్లో భాగంగా ఇందల్వాయి ని కూడా కలిపి ఇందల్వాయి జెడ్ పి హెచ్ ఎస్ హై స్కూల్, ఎస్ ఎస్ సి. సెంటర్ గా నియమించాలని.
గత సంవత్సరం నుండి ఎస్ ఎస్ సి. సెంటర్ కు కావలసిన పనులు మొత్తం పూర్తి చేసి స్కూల్. కు ప్రహరీ గోడ వాష్ రూమ్స్ ప్లే గ్రౌండ్ మా ఊరు మా బడి కార్యక్రమంలో అన్ని పనులు కల్పిస్తూ ఒక సెంటర్ కు కావలసిన సదుపాయాలన్నీ పూర్తి చేశామని విద్యాశాఖ అధికారులకు ఇందల్వాయి ఎంపీటీసీ మారంపల్లి సుధాకర్, ఇందల్వాయి గ్రామ సర్పంచ్ సత్తేవ్వ నరసింహులు, ఉప సర్పంచ్ లింగంపల్లి రాజేందర్, వినతి పత్రాన్ని అందజేశారు. గ్రామ ఎంపీటీసీ పట్టుదలతో ఇందల్వాయి. లో ఎలాగైనా2024, నాటి ఎస్ ఎస్ సి ఎగ్జామ్ సెంటర్ ను, తేవాలని పట్టుదలతో ఆయన కృషి స్కూల్ వద్దకు వెళ్తే కళ్ళకు కొట్టచ్చే విధంగా కనిపిస్తోంది.
ఆయన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సహకారంతో యువ నాయకుడు బాజిరెడ్డి జగన్ సహకారంతో హెడ్ మాస్టర్, ఉపాధ్యాయుల పట్టుదలతో గ్రామానికి కావలసిన అన్ని పనులు పూర్తిచేసి ఆయన సేవలు గ్రామస్తులు గుర్తించి ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.