నిజామాబాద్ A9 న్యూస్:
నిజామాబాద్ జిల్లాలోని గత 2022 సంవత్సరంలో అర్ధరాత్రి పూట ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని -4, బాల్కొండ పరిధిలో -5, ముప్కాల్ పరిధిలో-3, మెండోరా పరిధిలో-2, నంది పేట్ పరిధిలో -3 మొత్తం కలిపి 17 ట్రాన్స్ ఫార్మర్ లను పగులగొట్టి అందులోని ట్రాన్స్ ఫార్మర్ ఆయిల్ మరియు కాపర్ కాయిల్స్ లను దొంగిలించిన నిందితులు కూకట్ పల్లి హైదరాబాద్ కి చెందిన నిందితుడు పల్లిపాటి ఏసుదాస్, నర్ర శ్రీధర్ శాలిపేట్ గ్రామం, చిన్న శంకరంపేట్ మండలం, మెదక్ జిల్లా చెందిన నిందితుడు, ఇద్దరికీ గురువారం నాడు అట్టి మొత్తం 17 కేసులలో జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆర్మూర్ అయిన వేముల దీప్తి ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించడం జరిగినది. రాజేశ్వరి పబ్లిక్ ప్రాసిక్యూటర్ నిందితులకు శిక్షపడుటలో తమదైన వాదనలు వినిపించినారు. నిందితులకు శిక్ష పడుటలో ఆర్మూర్ కోర్టు కానిస్టేబుల్ ఆఫీసర్స్ రాజు పిసి 1825′ కనకయ్య పిసి 1819 లు కూడా సహకరించారు.