నిజామాబాద్ A9 న్యూస్:
ఆర్మూర్ నియోజకవర్గంలోనిఆలూరు మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణలో బీడీ టేకేదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు మాట్లాడుతూ బీడీ పరిశ్రమ కార్మికుల గురించి ఆలోచించే ఏకైక నాయకుడు కేసీఆర్ అని వారన్నారు. అన్ని వర్గాలు, అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేకు తాము బీడీ టేకే దార్ల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.