నిజామాబాద్ A9 న్యూస్:
ఆర్మూర్ ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని, మరో సారి ఆశీర్వదించి గెలిపించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూర్ మండలంలో గల గుంజలి గ్రామంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద ర్యాలీలో అశేష జనం హాజరై, భారీ స్థాయిలో బైక్ ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే బీజేపీ కాంగ్రెస్ నాయకులు అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. అనంతరం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గుంజలి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మాక్లూర్ మండల మాజీ వైస్ ఎంపీపీ ఆడేందర్ అమ్మ అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భంగా వారి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మాక్లూర్ ఎంపీపీ మాస్త ప్రభాకర్, బీఆర్ఎస్ నాయకులు ఆకుల రజనీష్, గుంజలి రంజిత్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు ఆర్మూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో యువతకు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ లెర్నింగ్ పత్రాలను పంపిణీ చేశారు. ఆ తర్వాత నందిపేట్ మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ పనులకు పూజ చేసి ప్రారంభోత్సవం చేశారు.
ఆర్మూర్ మండలంలోని ఎమ్మెల్యే నివాసంలో ఆర్మూర్ పట్టణ సెంట్రింగ్ అసోసియేషన్ సభ్యులు, వెల్మల్ గంగపుత్ర సంఘ సభ్యులు, అడవి మామిడిపల్లి వడ్డెర సంఘ సభ్యులు, దేగం రజక సంఘం, చిన్న యానం గంగపుత్ర సంఘం సభ్యులు, బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మద్దతు తెలిపి పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.