నిజామాబాద్ A9 న్యూస్:
కలెక్టర్ ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేందుకు వీలుగా కేసుల దర్యాప్తులు వేగవంతంగా పూర్తి చేసి నిర్ణీత గడువులోపు చార్జిషీట్ దాఖలు చేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. సమీకృత కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. కేసుల పురోగతిపై నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ డివిజన్ల వారిగా కలెక్టర్ సమీక్షించారు.