A9 న్యూస్:
దేశంలో పెట్రోల్, గ్యాస్, డిజిల్, నిత్యవసర సరకుల ధరలు ఆకాన్నంటుతున్నాయి. పెరిగిన భారీ రేట్లతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. బయట మార్కెట్లలో ఏమైనా కొనాలంటేనే జ జంకిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో సామాన్య ప్రజలకు భారీ ఊరట కలిగించే వార్తను కేంద్ర ప్రభుత్వం త్వరలోనే చెప్పబోతున్నట్లు సమాచారం. దేశంలో వెయ్యి రూపాయలు దాటిని వంట గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించే యోచనలో కేంద్రం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
గ్యాస్ సిలిండర్పై దాదాపు రూ.200 వరకు ధర తగ్గించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, ఈ ధరల తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.
భారీగా పెరిగిన ధరలతో ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. రానున్నది ఎన్నికల ఏడాది కావడంతో ఈ ఎఫెక్ట్ ఓట్లపై భారీగా చూపుతోందని ముందుగానే కేంద్రం అలర్ట్ అవుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే గ్యాస్ సిలిండర్ తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు అని అంటున్నారు.