నిజామాబాద్ A9 న్యూస్:
*ఆర్మీ జవాన్ ప్రాణాలు ఎంత విలువైనయో అర్థం అయ్యే బాధాకరమైన విషయం
*భారతదేశ సైనికులు సరిహద్దుల్లో ప్రాణాలు పెట్టి రక్షిస్తున్న భారతీయ జవాన్లు
*సరిహద్దుల్లో సైనికులు కంటికి నిద్ర లేకుండా కాపాడుతూనే ప్రతి గ్రామాల్లో పసి పిల్లవాడు కూడా సంతోషంగా నిద్రిస్తున్నాడు
* జై జవాన్ జై కిసాన్ అన్న నినాదం అందరికీ జోహార్లు
ఇందల్వాయి మండలంలోని చంద్రాన్ పల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ చెవుల ప్రశాంత్ గత మూడు నెలల నుండి అనారోగ్యంతో మృత్యువుతో పోరాడి చివరకు శ్వాస విడిచి యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని కన్నీరు పెట్టి సంఘటన ఇందల్వాయి మండలం చంద్రాన్ పల్లి గ్రామానికి చెందిన చెవుల ప్రశాంత్ మృతి దేహం సొంత గ్రామంలో కడసారి వీడ్కోలు పలికిన ప్రజలు ఒక ఆర్మీ జవాన్ భౌతిక కార్యక్రమాన్ని చూడటానికి తరలివచ్చిన జనం జనాన్ని చూసి తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశం కన్నీరు పెట్టిన సందర్భం నేడు చోటు చేసుకుంది.
ఆయనకు ఒక సంవత్సరం నారా క్రితం పెళ్లి కావడం ఆయనకు నాలుగు నెలల కుమారుడు ఉండటం మండలంలో ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టించిన సందర్భం నేడు ఇందల్వాయి మండలంలో చంద్రాన్ పల్లి గ్రామంలో ఆయనను చూడటానికి వచ్చిన జనం ఏడవకుండా వెళ్ళలేకపోయారు ఒక జవాన్ అంటే ఏంటో మరోసారి ఆయన కష్టం ఆయన పోయిన తర్వాత కుటుంబ సభ్యులకు ఎంత బాధాకరమో ఆయన సేవలు దేశానికి ఎంత అవసరమో నేడు ప్రతి కంటినీరు చుక్క లో దాగి ఉన్న ఆ బాధను ఆడ మగ తేడా లేకుండా ఆ ఏడుపుల్లో అర్థమయింది కడసారి వీడ్కోలు పలికిన ప్రజలు పడుతున్న బాధలు ఏంటో ప్రజల నీ ముగ్ధుల్ని చేసింది.
ఈ కార్యక్రమంలో అంతిమయాత్రలో పాల్గొన్న జడ్పిటిసి బాజిరెడ్డి జగన్, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాటేపల్లి నాగేష్ రెడ్డి, ఇందల్వాయి మండల ఎంపీపీ రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.