నిజామాబాద్ A9 న్యూస్:
ఆర్మూర్ పట్టణంలోని ఐ ఎస్ టి యు ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపుమేరకు హైదరాబాదులో ఇందిరాపార్క్ వద్ద మంగళవారం జరిగే మహాధర్న కార్యక్రమానికి
400 మంది బీడీ కార్మికులు తరలి వెళ్లారు. బస్సులు ప్రారంభానికి ముందుగా ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసు మాట్లాడుతూ మోడీ వీడి పరిశ్రమలు దెబ్బతీసే కుట్ర , సిగరెట్ కంపెనీలకు ఊడిగం చేసే పనిలో నిమగ్నమైనరని ఆయన అన్నారు. కార్మికుల ఉపాధి రక్షించాలని లేదా ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. జీవనోపాధి మృతిని ఇవ్వాలని దాసు డిమాండ్ చేశారు. దేశంలో 50 కోట్ల మంది కార్మికులు ఉంటే కేవలం 5 కోట్ల మందికి ఈ ఎస్ ఐ చట్టాలు అమలవుతున్నాయని కోట్ల మందికి సామాజిక చట్టాలు అమలుకాక, అతి తక్కువ వేతనంతో పేదరికంలో బతుకుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్య శివాజీ మాట్లాడుతు బీడీ పరిశ్రమ కోసం కృషి చేస్తున్న మా యూనియన్ కార్యక్రమాలను ఆటంకపరచడానికి ముత్తన్న మూఠా కుట్రలు చేస్తోందని ఆయన అన్నారు. బీడీ కార్మికుల సమస్యల పరిష్కారానికి పోటీ పడాలి కానీ వీడి పరిశ్రమ రక్షణ కోసం పోరాడుతున్న మా ఐఎఫ్టియు ను దెబ్బ తీయాలని దుర్బుద్ధి సరికాదని తెలియజేస్తున్నాం.
ఫోన్లలో బీడి కమిషన్ దారులను బెదిరించడం, మానుకోవాలని, ఆయన అన్నారు. ఐ ఎఫ్ టి యు జాతీయ స్థాయిలో పనిచేస్తుందని శివాజీ తెలిపారు. వర్గ దృక్పథాన్ని మర్చిపోయి, మా యూనియన్ పై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని, లేనిచో కార్మికులే ముత్తెన్న ముఠాకు తగిన జవాబు చెబుతారని ఆయన సూచించారు.
హైదరాబాద్ కు తరలి వెళ్లిన వారిలో యూనియన్ నాయకులు చిట్టిక్క, మన్నెమ్మ, ధనలక్ష్మి, షబానా, లక్ష్మి , గంగామణి, రాజశ్రీ, అబ్దుల్, ప్రిన్స్, ఎస్ రవి, పద్మ, తదితరులు పాల్గొన్నారు.