కామారెడ్డి A9 న్యూస్:
గాంధారి మండలంలోని ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సదాశివనగర్ సిఐ రామన్ తెలిపారు గాంధారి మండల కేంద్రంలో ప్రజలు యువకులతో ఏర్పాటు చేసిన సైబర్ నేరాల అవగాహన సదస్సుకు సదాశివ నగర్ సిఐ రామన్ హాజరై మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో బందిపోటు నేరాలు గాని దొంగతనాలు కానీ గాని దారిదోపిడీలు గాని తగ్గిపోయాయని సిసి కెమెరాల వల్ల సెల్ఫోన్ డాటా రికవరీ వల్ల సెల్ ఫోన్ టవర్ లోకేషన్ ల వల్ల ముఖ్యమైన నేరాలన్నీ తగ్గుముఖం పట్టాయని కానీ సైబర్ నేరగాళ్లు ప్రజల యొక్క అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని రెచ్చిపోతున్నారని అన్నారు. ప్రస్తుతం సమాజంలో సైబర్ నేరాల పట్ల విద్యార్థి నుంచి వృద్ధుని వరకు అవగాహన లేకపోవడం వల్ల సైబర్ నేరాల బారిన పడుతున్నారని సైబర్ నేరాల బారిన పడకుండా ఉండాలంటే అవగాహన మరియు అప్రమత్తత చాలా ముఖ్యమైనదని ఆయన అన్నారు. ముఖ్యంగా యువతి మొబైల్ ఫోన్ మరియు ఇంటర్నెట్ వాడకం చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని అనవసరమైన అప్లికేషన్లని డౌన్లోడ్ చేయకూడదని అపరచిత ఫోన్ కాల్ కి సమాధానం ఇవ్వకూడదని ఆన్లైన్ లోన్ యాప్ ని వాడకూడదని అసభ్యంగా ఉన్న అప్లికేషన్స్ నీ డిలీట్ చేయాలని ఆయన కోరారు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండడమే కాకుండా తెలియకుండా సైబర్ నేరాల బారిన పడినవారు దరఖాస్తు ఇవ్వడానికి వెనకాడకూడదని పోలీస్ స్టేషన్ కి రావడం ఇబ్బందిగా ఉంటే ఆన్లైన్ తమ యొక్క దరఖాస్తు ఇవ్వాలని లేదా టోల్ ఫ్రీ నెంబర్ అయినా 1930 కిగాని తమ యొక్క దరఖాస్తు ని నమోదు చేయాలని తెలిపారు సైబర్ నేరం ద్వారా ఎవరైనా డబ్బు పోగొట్టుకున్నట్టయితే 24 గంటలలోపు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి లేదా 1930 నెంబర్ కి కాల్ చేసి దరఖాస్తు నమోదు చేసినట్లయితే పోగొట్టుకున్న డబ్బులు తిరిగి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఈ సైబర్ క్రైమ్ కార్యక్రమంలో గాంధారి ఎస్సై సుధాకర్, ఏ ఎస్సై గంగారం, కానిస్టేబుల్ కిషన్ రాకేష్ మరియు మండలంలోని యువకులు తదితరులు పాల్గొన్నారు.