నిజామాబాద్ A9 న్యూస్:
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇటీవల ఆర్మూర్ నియోజకవర్గ యువత కోసం ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. వారం రోజుల పాటు వచ్చిన అప్లికేషన్ల లబ్ది దారులకు సోమవారం నుంచి లెర్నింగ్ లైసెన్స్ ఇవ్వబడుతుంది అని, అప్లై చేసుకున్న యువతి, యువకులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు వచ్చి ఎల్ ఆర్ లను తీసుకోవాలని సూచించారు. రాని ఎడల వారి అప్లికేషన్ రద్దవుతుందని గమనించాలని కోరారు.