నిజామాబాద్ A9 న్యూస్:
*రజకులను విస్మరించిన ప్రభుత్వం
*ఆశపెట్టి ఓట్లు వేయించుకొని పదవులను అనుభవిస్తున్న నాయకులు
*మళ్లీ ఓట్ల కోసం సిద్ధమవుతున్న నాయకులు
*రజకులకు పట్టపగలే చందమామను చూపించిన నాయకులు
ఎంతో నమ్మకంతో బిఆర్ఎస్ పార్టీకి పూర్తి మద్దతు తెలిపిన రజకుల ను అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించింది. న్యాయమైన సమస్యలు, దర్మమైన కోర్కెలను తీర్చకుండ నిర్లక్యం చేయడాన్ని రజక ఐక్య వేదిక ముక్త కంఠంతో ఖండించింది. సమాజంలో అత్యంత పేదరికంలో నేటికీ మగ్గుతున్న రజకుల పట్ల కనీసం మానవతా దృక్పథంతో కూడా ఆలోచన చేయని బిఆర్ఎస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ ఆందోళనకు సిద్దం కావాలని రజక ఐక్య వేదిక ఏకగ్రీవ తీర్మానాలు చేసింది. నిజామాబాద్ నగరంలోని గుపాన్ పల్లి దీపక్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
గత ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వము రజకులకు న్యాయం చేస్తుందని పూర్తిగా విశ్వసించి రజక సామాజిక వర్గం మొత్తం ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి
ఏకపక్షంగా బీఆర్ఎస్ కు మద్దతు తెలిపింది. కాని టిఆర్ఎస్ ప్రభుత్వం రజకులకు తగిన న్యాయం చేయకపోవడంతో రజకులు బాధతో ఉన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అన్నారు.
నిరుపేద రజక నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం లోన్ లు ఇస్తామని అన్నారు.
మొదటి దశగా ప్రతి మండలంలో రెండవ దశలో మేజర్ గ్రామపంచాయతీలలో రజక సంఘ భవనాలు నిర్మిస్తామని అన్నారు.
తీర్మానాలు:
1. గత ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చమని ఎమ్మెల్యేలపై తీవ్ర ఒత్తిడి చేయాలి….
2. రాబోయే ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గం నుండి రజక సామాజిక వర్గం నుండి ఒకరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలి !
నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు శంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమాని కి ముఖ్య అతిథిగా మానస గణేష్ హాజరయ్యారు కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నరేష్, జిల్లా ముఖ్య సలహాదారులు అమర్, జీవన్, కళ్యాణ్, రాజేందర్, ఉపాధ్యక్షులు అల్వాల దేవయ్య, ఎత్తోండ రమేష్, ఐలాపూర్ గంగాధర్, జలాల్పూర్ గంగాధర్, మహిళా అధ్యక్ష కార్యదర్శులు రమాదేవి, తులసి, కోశాధికారి రేఖ, సుజాత, యువజన అధ్యక్ష కార్యదర్శులు మీరా శ్రావణ్, శ్యామ్, నియోజకవర్గ ఇన్చార్జీలు కొన్ని వినోద్, యానంపల్లి వినోద్, బండి సురేష్, నిజామాబాద్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు రామచందర్, సాయిలు, జితేందర్, వివిధ మండలాల అధ్యక్షలు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.