నిజామాబాద్ A9 న్యూస్:
నిజామాబాద్ జిల్లాలోని ఐదు శాసనసభ నియోజకవర్గాలలో బిజెపి అభ్యర్థులు గెలుస్తారని మహారాష్ట్రలోని వని ఎమ్మెల్యే సంజీవరెడ్డి బాపూరావు అన్నారు ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ ఫంక్షన్ హాల్ లో ఆదివారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆర్మూర్ తో పాటు జిల్లా ప్రజలు ఒకసారి బిజెపి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపిస్తే మంచి సుపరిపాలన అందిస్తామన్నారు. రాజకీయాలలో డబ్బు సంపాదించడం ముఖ్యం కాదని ప్రజలకు సేవ చేయాలన్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలతో పాటు శాసనసభ ఎన్నికలు జరిగే మరో నాలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే ప్రభాస్ యోజనలో 17 రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యేలు వారం రోజులపాటు పర్యటిస్తున్నారన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో అన్ని వర్గాల ప్రజలు, శక్తి కేంద్రాల ఇన్చార్జిలు, మహిళలు, రైతులు, యువకులతో కలిసి మాట్లాడినట్లు వివరించారు.
దేశంలో ప్రధాని మోడీ చొరవతో చంద్రయాన్ 3 విజయవంతం అయ్యిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పేదలకు పంపిణీ చేయలేదన్నారు. అవినీతి, అధికార దాహంతో అరాచకాలు చేస్తున్నారన్నారు. ఆర్మూర్ పట్టణంలో జీవన్ రెడ్డి నిర్వహించిన ర్యాలీలో విద్యుత్ స్తంభాలు, ప్రభుత్వ ఆస్తులు, రోడ్డు, డివైడర్లపై ఫ్లెక్సీలు, పార్టీ రంగును వేయడం చట్ట విరుద్ధమన్నారు.
రాబోయే శాసనసభ ఎన్నికలలో ఆర్మూర్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.అనంతరం 400 బైక్లతో ర్యాలీ నిర్వహించారు. అంతేకాకుండా మొన్నటికి మొన్న తనకు టికెట్ వచ్చిందని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ర్యాలీ తీస్తే కెసిఆర్ కూతురు కవిత ఈ ర్యాలీలో పాల్గొని ర్యాలీలో ప్రజలు లేరని అంబేద్కర్ చౌరస్తా నుంచి నిర్స్కమించరడమే కాకుండా అంబేద్కర్ ను అవమానపరిచే విధంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేయకుండానే వెళ్లడాన్ని అంబేద్కర్నే కాదు దళితులను సైతం అవమానపరిచినట్లుగా బిజెపి భావిస్తా ఉందని. ఆదివారం రోజు చేపట్టినటువంటి ఈ బైక్ ర్యాలీ దృశ్యాన్ని చూసిన బీఆర్ఎస్ కచ్చితంగా కంగు తినడం ఖాయమని. బిజెపి రాష్ట్ర నాయకత్వం ఎవరికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన కార్యకర్తలు కమలం కు ఓటు వేసే విధంగా ప్రజలను చైతన్య పరిచావల్సిన అవసరం కార్యకర్తలపై ఉందని. కార్యకర్తలు రామదండుల, సైనికుల్లా పనిచేసి ఆర్మూర్ లో బీజేపీ ఎమ్మెల్యేను గెలిపించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి గంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి అల్జాపూర్ శ్రీనివాస్, బిజెపి సీనియర్ నాయకుడు పైడి రాకేష్ రెడ్డి, నియోజకవర్గ నాయకురాలు విజయభారతి, బిజెపి జిల్లా అధికార ప్రతినిధి జేసు అనిల్ కుమార్, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాజ్, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అందాపూర్ రాజేష్, మారంపల్లి గంగాధర్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు యామాద్రి భాస్కర్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు నూతల శ్రీనివాస్, బిజెపి నియోజకవర్గ కన్వీనర్ పాలెపు రాజు, బిజెపి పట్టణ మండల అధ్యక్షులు ఉదయ్, రోహిత్ రెడ్డి నాయకులు పాన్ శ్రీనివాస్, సురేష్ రెడ్డి సంతోష్ రెడ్డి, దొండి ప్రకాష్, విజయానంద్, దేగాం యాదగిరి తదితరులు పాల్గొన్నారు.