నిజామాబాద్ A9 న్యూస్:
బోధన్ పట్టణంలోని వాణి విద్యా నికేతన్ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలి (టీజీవిపి) నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాని విద్యానికేతన్ పాఠశాల తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో శనివారం బోధన్ ఎంఈఓ నాగనాథ్ కి వినతిపత్రం సమర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్ డివిజన్ అధ్యక్షులు మీసాలె నాగేష్ మాట్లాడుతూ బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్ లో గల వాణి విద్యానికేతన్ పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేకుండా కనీసం విద్యార్థులకు క్లాసులు సరిగ్గా లేవు, అలాగే రేకుల షెడ్డులో ఉన్నట్టు వంటి వాని విద్యానికేతన్ పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో టీజీవిపి వాని విద్యానికేతన్ పాఠశాల గుర్తింపు రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాధవ్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు.